Sonipat Fire News: హరియాణాలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోనిపట్ జిల్లాలోని కుండ్లీ పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 20 వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. పరిశ్రమలో ఉన్న 20 మంది కార్మికులను రక్షించామని.. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని అధికారులు తెలిపారు.
కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. రంగంలోకి 20ఫైర్ ఇంజిన్లు - హరియాణా న్యూస్
Sonipat Fire News: హరియాణా సోనిపట్‌లోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అప్రత్తమైన అగ్నిమాపక అధికారులు సహాయక చర్యలు చేపట్టి 20 మంది కార్మికులను రక్షించారు.
![కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. రంగంలోకి 20ఫైర్ ఇంజిన్లు sonipat fire news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15045203-930-15045203-1650230103142.jpg)
sonipat fire news
దిల్లీ సహా సమీప ప్రాంతాల నుంచి అగ్నిమాపక వాహనాలను రప్పించామని పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీ సమీపంలో గెయిల్‌కు చెందిన అధిక ఉష్ణోగ్రత గల గ్యాస్ పైప్‌లైన్ ఉండడమే ప్రమాదానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. దీంతో వెంటనే గెయిల్ అధికారులకు సమాచారం అందించి సరఫరాను నిలిపివేసినట్లు చెప్పారు. పారిశ్రామిక ప్రాంతం కావడం వల్ల మంటలు మరింత వ్యాపిస్తే పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:బోట్ ఆపరేటర్ల మధ్య గొడవ.. సరస్సులో చిక్కుకున్న ప్రయాణికులు