తెలంగాణ

telangana

భారత్​కు మరో 10 రఫేల్​ యుద్ధ విమానాలు

By

Published : Mar 28, 2021, 6:16 PM IST

వచ్చే నెల రోజుల్లో భారత సైన్యం అమ్ముల పొదిలో మరో 10 రఫేల్ యుద్ధ విమానాలు చేరనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రెండు, మూడు రోజుల్లో భారత్‌కు 3 రఫేల్ విమానాలు వస్తాయని పేర్కొన్నాయి. ప్రస్తుతం 11 రఫేల్​ యుద్ధ విమానాలు అంబాలాలోని 17వ స్క్వాడ్రన్​లో సేవలు అందిస్తున్నాయి.

Major boost for IAF, 10 Rafale's to join in one month
'భారత్​కు రానున్న 10 రఫేల్​ యుద్ధ విమానాలు'

భారత వాయుసేన సామర్థ్యాన్ని మరింత పెంచేలా మరో 10 రఫేల్ యుద్ధవిమానాలు సైన్యంలో చేరనున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో మూడు రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్‌ నుంచి నేరుగా భారత్‌కు చేరుకుంటాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఆ తర్వాత మరో 7లేదా 8 రఫేల్ యుద్ధవిమానాలు వచ్చేనెల మధ్యనాటికి భారత్‌కు చేరుకుంటాయని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారత సైన్యం వద్ద 11 రఫేల్ యుద్ధవిమానాలు ఉన్నాయి. మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్రం, ఫ్రాన్స్‌తో 2016లో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదీ చదవండి :యుద్ధం వచ్చినా భారత్- పాక్ మధ్య వీడని 'ఫోన్ బంధం'!

ABOUT THE AUTHOR

...view details