తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Mahua Moitra Shashi Tharoor Photos : టీఎంసీ మహిళా ఎంపీ- శశిథరూర్ ఫొటోలు వైరల్​.. సస్పెండ్​ చేయాలని బీజేపీ డిమాండ్​!

Mahua Moitra Shashi Tharoor Photos : టీఎంసీ మహిళా ఎంపీ ​మహువా మోయిత్రా, కాంగ్రెస్​ నేత శశిథరూర్​కు చెందిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్​చల్​ చేశాయి. వాటిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ ఫొటోలు క్రాపింగ్​ చేసినవని మహువా మోయిత్రా.. బీజేపీపై మండిపడ్డారు.

Shashi Tharoor Mahua Moitra Photos
Shashi Tharoor Mahua Moitra Photos

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2023, 10:47 PM IST

Mahua Moitra Shashi Tharoor Photos :తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ ఎంపీ మహువా మోయిత్రా, కాంగ్రెస్​ నాయకుడు శశిథరూర్​కు సంబంధించిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. మోయిత్రా సిగరెట్​, షాంపైన్​ తాగుతున్నట్లు ఆ ఫొటోల్లో కనిపిస్తోందని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. శశిథరూర్​తో ఆమె చనువుగా ఉన్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు. అయితే వీటిపై స్పందించిన మహువా మోయిత్రా.. బీజేపీయే కావాలనే క్రాపింగ్ ఫొటోలు పోస్ట్​ చేసిందని మండిపడ్డారు.

సోషల్​ మీడియాలో ఆదివారం ఈ ఫొటోలు హల్​చల్​ చేశాయి. మోయిత్రా, శశిథరూర్ మధ్య ఏదో ఉందంటూ.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయడంలో బీజేపీ ఐటీ సెల్​ పాత్ర ఉందని మహువా మోయిత్రా ఆరోపించారు. బీజేపీ ఐటీ సెల్​ క్రాపింగ్​ చేసిన ఫొటోలకు బదులు.. పూర్తి​ ఫొటోలను అప్లోడ్​​ చేస్తే బాగుండేదన్నారు.

సిగరెట్ అంటే నాకు అలర్జీ : మహువా మోయిత్రా
నెట్టింట తనపై వస్తున్న ట్రోల్స్​కు బదులిచ్చారు ఎంపీ మహువా మోయిత్రా. తాను సిగరెట్​ తాగనని, అదంటే తనకు అలర్జీ అని ఆమె స్పష్టం చేశారు. కేవలం స్నేహితులతో ఉన్నప్పుడు మాత్రమే సరదాగా ఫోజులిస్తానని తెలిపారు.

'పార్లమెంట్‌లో ప్రశ్నలడిగేందుకు మహువా డబ్బులు తీసుకున్నారు'
Mahua Moitra Lok Sabha Speech : మరోవైపు, మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్​ దుబే సంచలన ఆరోపమలు చేశారు. డబ్బులు తీసుకుని మహువా.. లోక్​సభలో ప్రశ్నలు అడిగారంటూ విమర్శలు గుప్పించారు. ఇదే విషయాన్ని ఆయన లోక్​సభ స్పీకర్​ ఏం బిర్లాకు లేఖ రాశారు. అదానీ గ్రూప్​, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేందుకు వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి మహువా డబ్బులు తీసుకున్నారంటూ ఆరోపించారు. తక్షణమే ఆమెను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే, నిషికాంత్‌ చేసిన ఆరోపణలపై మహువా స్పందించారు. ఎలాంటి దర్యాప్తునైనా స్వాగతిస్తానని ఆమె స్పష్టం చేశారు. నిషికాంత్‌ దుబేపై నకిలీ అఫిడవిట్లు, ఇతర అభియోగాలపై దర్యాప్తు పూర్తి చేశాక తనపై ఎలాంటి చర్యలు తీసుకున్నా స్వాగతిస్తానన్నారు.

ఇంధన, ఇన్ఫ్రాకు సంబంధించిన ఓ కాంట్రాక్టు అదానీ గ్రూపునకు దక్కడం వల్ల హీరానందానీ గ్రూపు వ్యాపార ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో మహువా పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని ఎంపీ నిషికాంత్‌ దుబే తన లేఖలో ఆరోపించారు. హీరా నందానీ అందుకోసం రూ.2కోట్లు, ఐఫోన్‌ వంటి ఖరీదైన బహుమతులు, ఎన్నికల్లో పోటీకి రూ.75లక్షలు ఇచ్చారని లేఖలో ఆరోపించారు. 2019నుంచి 2023 మధ్య కాలంలో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు దర్శన్‌ హీరానందానీ కోరిక మేరకు అడిగినవేనని నిషికాంత్‌ ఆరోపించారు.

'కాళీమాత'పై ఎంపీ కామెంట్స్​.. దీదీ కీలక వ్యాఖ్యలు.. 'తప్పు చేశారు కానీ..!'

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఫ్రాన్స్‌ అత్యున్నత పౌర పురస్కారం

ABOUT THE AUTHOR

...view details