Mahindra salesman mocks farmer: కర్ణాటక తుముకూరులోని మహీంద్రా షోరూమ్‌లో ఓ రైతుకు జరిగిన అవమానంపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. తమ సంస్థ వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుతుందని, ఇలాంటి ఘటనలను అత్యవసరమైనవిగా భావించి పరిష్కరిస్తామన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
"మహీంద్రా.. తమ ప్రజలు, పెట్టుబడిదారులకు శక్తినిచ్చేలా తోడ్పడుతుంది. వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుతుంది. ఇలాంటి వాటికి ఏమైనా ఇబ్బంది జరిగితే అత్యవసరంగా పరిష్కరిస్తాం." అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.
ఏం జరిగింది?
కర్ణాటక, తుముకూర్లోని ఓ మహీంద్రా కార్ల షోరూమ్‌కు కెంపెగౌడ అనే రైతు తన స్నేహితులతో కలిసి బొలెరో పికప్ ట్రక్కు కొనేందుకు వెళ్లారు. లోపలకు వెళ్లిన క్రమంలో వారి వస్త్రాలంకరణను హేళన చేస్తూ అక్కడి సేల్స్‌మ్యాన్ అవమానించాడు. కారు ధర మీరనుకున్నట్లు రూ.10 కాదంటూ వారిని తక్కువ చేసి మాట్లాడాడు. ఈ సంఘటన మొత్తం అక్కడే ఉన్న ఒకరు రికార్డు చేశారు. రైతును ఉద్దేశిస్తూ సేల్స్‌మ్యాన్ అసభ్యకరంగా మాట్లాడుతున్నట్లు వీడియోలో ఉంది.
" షోరూమ్‌కు వెళ్లగా మాతో సేల్స్‌మ్యాన్ అవమానకరంగా మాట్లాడాడు. రూ.10కి వచ్చే కారు కాదంటూ హేళన చేశాడు. కారు కొనేందుకు ఇంత మంది రారని మా స్నేహితులను ఉద్దేశించి మాట్లాడాడు."