Mahila Samman Savings Certificate How To Open In Bank:'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ (MSSC)'కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మహిళాలకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. ఇప్పటి వరకు ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ ఖాతాను పోస్టాఫీసుల్లో మాత్రమే తెరవడానికి అవకాశం కల్పించిన ప్రభుత్వం.. తాజాగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు అనుమతిచ్చింది. అంటే ఇకపై బ్యాంకుల ద్వారా కూడా ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ ఖాతాను తెరవచ్చన్నమాట. అయితే, ఈ ‘మహిళా సేవింగ్స్ స్కీమ్ అంటే ఏమిటి..?, ఈ పథకంలో చేరేందుకు ఖాతాను ఎలా తెరవాలి..?, ఏయే బ్యాంకులకు ప్రభుత్వం అనుమతిచ్చింది..?, ఈ పథకం ద్వారా మహిళాలకు ఎంత శాతం వడ్డీ లభిస్తుంది..?, కాల వ్యవధి ఎంత..? అనే వివరాలను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ అంటే ఏమిటి..
What is Mahila Samman Savings Scheme?:దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు పెట్టుబడులు పెట్టేలా వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 2023 బడ్జెట్‌లో కేవలం మహిళల కోసం వన్-టైమ్ సేవింగ్స్ స్కీంను ప్రవేశ పెట్టింది. ఈ స్కీం ద్వారా ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ను అందిస్తోంది.
12 ప్రభుత్వ, 4 ప్రైవేటు బ్యాంకులకు అనుమతి
12 government and four private banks are allowed:ఇప్పటివరకూ ఈ ఖాతాను పోస్టాఫీసుల్లో మాత్రమే తెరవడానికి అవకాశమిచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు, నాలుగు ప్రైవేట్ రంగ బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. అంటే 12 ప్రభుత్వ రంగబ్యాంకుల్లోనూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు ప్రైవేట్ బ్యాంకులైన ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకుల ద్వారా కూడా మహిళలు ఈ స్కీమ్‌లో చేరవచ్చు.
Women Saving Scheme : మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్.. ఇకపై బ్యాంకుల్లోనూ లభ్యం!
వడ్డీ రేటు
Interest rate.. ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ పథకం ప్రభుత్వ హామీ ఉన్న పథకం. దీనిపై 7.5% ఫిక్స్‌డ్ వడ్డీ రేటు లభిస్తుంది. ఖాతాదారురాలి కుమార్తె మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్ చేసిన మొత్తం వడ్డీని కలిపి ఇస్తారు.