Mahbubnagar Telangana Assembly Election Result Live : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా హస్తం పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. వీటిలో 12 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా, 2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని ముందంజలో ఉన్న స్థానాల్లో కొడంగల్ నుంచి పీసీసీ అధ్యక్షుడు అనుమల రేవంత్ రెడ్డి గెలుపొందారు. 31,849 ఓట్ల మెజార్టీతో పట్నం నరేందర్ రెడ్డిపై విజయం సాధించారు. కల్వకుర్తిలో కసిరెడ్డి నారాయణరెడ్డి, దేవరకద్రలో కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్‌రెడ్డి గెలుపొందారు. వీటితో పాటు మరో ఐదు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
నియోజకవర్గాల వారీగా వివరాలు ,:
కొడంగల్ : కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేంద్రరెడ్డిపై 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
జడ్చర్ల : బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి జె. అనిరుధ్ రెడ్డి గెలుపొందారు.
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కే. రాజేష్‌రెడ్డి విజయం. సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డిపై గెలుపు జెండా ఎగురవేశారు.
వనపర్తి : బీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి టి. మేఘారెడ్డి ఘనవిజయం సాధించారు.
నారాయణ్ పేట్ : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిట్టెం పర్ణిక రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. ఆమె ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.రాజేందర్ రెడ్డి పై గెలుపొందారు.
దేవరకద్ర : బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి జి. మధుసూదన్‌రెడ్డి గెలుపొందారు.