తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక్కరాత్రిలో 21 శునకాలు మృతి- అసలేమైంది? - మహారాష్ట్ర క్రైమ్ న్యూస్

విష ప్రయోగం చేసి 21 శునకాల ప్రాణాలు తీశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ ఘటనపై ఫిర్యాదు అందిన నేపథ్యంలో జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

dogs death
శునకాలు మృతి

By

Published : Oct 9, 2021, 3:08 PM IST

ఒకే ప్రాంతంలో, ఒక్క రాత్రిలో 21 శునకాలు మరణించగా, 30 కనిపించకుండా పోయిన ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. అయితే విషప్రయోగం వల్లే మూగజీవాలు చనిపోయాయని జంతుప్రేమికులు ఆరోపిస్తున్నారు. దీనిపై సునిల్ ఉదయ్ డోంగ్రే అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

చనిపోయిన శునకం

'శునకాలను చంపాలనే ఉద్దేశంతోనే గుర్తుతెలియని వ్యక్తులు చికెన్​ కలిపిన అన్నంలో విషం పెట్టారని.. ఫలితంగా 21 కుక్కలు చనిపోయాయని' డోంగ్రే తన ఫిర్యాదులో ఆరోపించాడు. అంతేకాంకుడా సుమారు 30 శునకాలు కనిపించకుండాపోయినట్లు పేర్కొన్నాడు.

మృతిచెందిన వీధి శునకం..

మరోవైపు.. ఫుడ్ పాయిజన్ కారణంగానే శునకాలు మరణించినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చిన వెటర్నరీ అధికారులు.. తుది పరీక్షల తర్వాతే అసలు కారణం తెలుస్తుందన్నారు. ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

శునకాల మృతిపై ఫిర్యాదు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details