తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బట్టలు సరిగ్గా వేసుకోలేదని మందలిస్తే.. అమ్మమ్మను చంపేశాడు! - నాగ్‌పూర్ నేర వార్తలు

తనకు మంచి మాటలు చెబుతున్న అమ్మమ్మను కడతేర్చాడో మనవడు. కోపంతో తాను ఏం చేస్తున్నాడో మరచిపోయి వృద్ధురాలి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. చేతులు, కాళ్లు కట్టేసి గొంతు కోసి అమ్మమ్మను చంపేసిన దారుణ ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.

murder
హత్య

By

Published : Dec 1, 2021, 5:40 AM IST

Updated : Dec 1, 2021, 6:48 AM IST

'మంచి బట్టలు వేసుకోరా నాన్నా' అని చెప్పడమే ఆ వృద్ధురాలి పాలిట శాపమైంది. తన మనవడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో వెలుగుచూసింది.

ఇదీ జరిగింది..

న్యూ నందనవన్ ప్రాంతంలో దేవకాబాయి జీవన్‌దాస్ బోబడే (78) అనే వృద్ధురాలు తన కుమార్తెతో కుటుంబంతో కలసి నివసిస్తోంది. ఆమె గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటుండగా.. మొదటి అంతస్తులో కుమార్తె ఉంటుంది. ఆమె కొడుకు మితేష్ సంజయ్ పాచ్‌భాయ్‌(21) అప్పుడప్పుడు మంచినీటి పంపు ఆన్ చేసేందుకు కిందికి వస్తుంటాడు. ఈ క్రమంలో శనివారం కిందికి వచ్చిన మనవడిని.. సరైన దుస్తులు ధరించట్లేదని.. మంచి బట్టలు వేసుకోవాలని మందలించింది పచ్​భాయ్.

దీనితో కోపోద్రిక్తుడైన మితేష్.. దేవ్‌కాబాయిని నేలపై తోసేశాడు. తన ప్యాంటుతో ఆమె గొంతు నులిమి.. చేతులు, కాళ్లు కట్టేసి, కత్తితో గొంతు కోసి హతమార్చాడు.

ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఉదంతంపై సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం అర్ధరాత్రి మితేష్ సంజయ్ పాచ్‌భాయ్‌ను అరెస్టు చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 1, 2021, 6:48 AM IST

ABOUT THE AUTHOR

...view details