మహారాష్ట్ర రత్నగిరిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లోట్ ఎంఐడీసీ(మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ప్రాంతంలోని ఓ రసాయన కంపెనీలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరో ఎనిమిది మంది క్షతగాత్రులయ్యారు. వీరు సమీప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తొలుత పేలుడు సంభవించడం వల్లే.. మంటలు చెలరేగాయని అనుమానిస్తున్నారు.