మహారాష్ట్ర కొల్హాపుర్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది. షాహువాడి తాలూకాలోని కపాషి గ్రామంలో అపహరణకు గురైన బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
కిడ్నాప్‌కు గురైన బాలుడు మృతి- నరబలిగా అనుమానం - కిడ్నాప్‌కు గురైన బాలుడు మృతి
మహారాష్ట్రలో రెండు రోజుల క్రితం అపహరణకు గురైన ఏడేళ్ల బాలుడు.. ఇంటి వెనకే శవమై కనిపించాడు. అనుమానాస్పదంగా పడి ఉన్న మృతదేహాన్ని చూసి.. నరబలిగా అనుమానిస్తున్నారు.
కిడ్నాప్‌కు గురైన బాలుడు మృతి
అరవ్ కేశవ్ కేశారే అనే ఏడేళ్ల బాలుడు.. రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. అయితే మంగళవారం ఉదయం 6గంటలకు అరవ్ ఇంటి వెనకాలే శవమై కనిపించాడు. చిన్నారి ఒంటి మీద పసుపు, కుంకుమ ఉండటం వల్ల నరబలి ఇచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. వారి సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:అక్కాచెల్లెళ్లను గదిలో బంధించి.. ముగ్గురు కలిసి నెలపాటు...