తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆదర్శ మహిళ- 3వేల కొవిడ్​ శవాలకు అంత్యక్రియలు - మహారాష్ట్ర మహిళా సామాజిక కార్యకర్త కవితా చౌహాన్​

కరోనా సోకిందంటే చాలు.. అయిన వారు కూడా ఆమడ దూరం ఉండాల్సిన పరిస్థితి. ఇక కొవిడ్​తో మృతిచెందిన వారి పరిస్థితి అనాథలకంటే దారుణం. కొన్ని చోట్ల క్రేన్​ల సాయంతో అంత్యక్రియలు చేపడుతున్న దృశ్యాలను నిత్యం అనేకం జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మహిళ.. ధైర్యంగా ముందుకొచ్చి కొవిడ్​ మృతదేహాలకు సంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. అలా.. ఇప్పటివరకు సుమారు 3వేల కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేశారామె.

A woman cremates 3000 Covid patients bodies
కవితా చౌహాన్​, 3వేల కొవిడ్​ మృతదేహాలకు దహన సంస్కారాలు

By

Published : May 11, 2021, 1:10 PM IST

3వేల కొవిడ్​ మృతదేహాలకు దహన సంస్కారాలు

కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను ముట్టుకోవడం ద్వారా.. వైరస్​ సోకుతుందనే భయంతో అనేక శవాలను అనాథల్లా వదిలేస్తున్నారు. అలాంటి వారి చివరి మజిలీ సంప్రదాయబద్ధంగా, గౌరవ ప్రదంగా ఉండాలని అనుకున్నారు ఓ మహిళ. 'నేనున్నానంటూ' ముందుకొచ్చి కొవిడ్​ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు మహారాష్ట్ర సోలాపుర్​కు చెందిన సామాజిక కార్యకర్త కవితా చౌహాన్​. కరోనా ప్రబలినప్పటి నుంటి ఇప్పటి వరకు ఆమె సుమారు 3వేల కరోనా మృతదేహాలకు సంప్రదాయపద్ధతిలో దహనం సంస్కారాలు నిర్వహించారు.

ఎలాంటి బాధ లేదు

ఎలాంటి భయానికి లోనుకాకుండా చేపట్టే ఈ కార్యక్రమంలో తనకు మున్సిపల్​ అధికారులు అండగా నిలుస్తున్నారని 'ఈటీవీ భారత్​'తో చెప్పుకొచ్చారు కవిత.

కవితా చౌహాన్​

"నేను చాలా దహన సంస్కారాలు చేశాను. ఇలా చేయడం వల్ల నాకు బాధ, దుఖం లాంటి ఫీలింగ్స్ కలగటం లేదు.​నా సొంతవాళ్లు చనిపోయినా నేను ఏడుస్తానో లేదోనని నాకే అనుమానంగా ఉంది."

- కవితా చౌహాన్​

ఇదీ చదవండి:అంత్యక్రియలకు తోపుడుబండిపైనే తల్లి మృతదేహం

గతేడాది ఏప్రిల్​ 12న సోలాపుర్​లో తొలి కరోనా మరణం వెలుగుచూసింది. ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ సమయంలో కొంతమంది ప్రభుత్వాధికారులు ముందడుగేశారు. ఆ తర్వాత.. కొవిడ్​తో చనిపోయే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. ఈ నేపథ్యంలో అంత్యక్రియల ద్వారా కరోనా సంక్రమిస్తుందని, కొవిడ్​ బాధితులకు దూరంగా ఉండాలని అక్కడి ప్రభుత్వం హెచ్చరించింది. ఫలితంగా.. అంతిమ కార్యక్రమాలు చేపట్టేందుకు దాదాపు అందరూ నిరాకరించారు.

1,900 మందికి ఉచితంగా..

ఈ తరుణంలో 'నేనున్నానంటూ'ముందుకొచ్చారు కవితా చౌహాన్​. ఈ కార్యక్రమంలో తనకు అండగా నిలవాలని మున్సిపల్​ కమిషనర్​, డిప్యూటీ కమిషనర్​, తోటి సామాజిక కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలా.. హిందూ శ్మశానవాటికలో ఈ బాధ్యతలు నిర్వహించడం ప్రారంభించిన కవిత.. కరోనా తొలిదశలో సుమారు 1,900 మందికి ఉచితంగా దహన సంస్కారాలు చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆమె కష్టాన్ని మున్సిపాలిటీ అధికారులు గ్రహించి.. ఆ తర్వాత ఒక్కో మృతదేహానికి రూ.1,000 ఇస్తున్నారు.

ప్రస్తుతం.. దేశంలో రెండోదశ కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలో.. ఆస్పత్రులలో పడకలు, ఆక్సిజన్​ కరవై రోజుకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ.. కొవిడ్​ మృతదేహాలకు సంప్రదాయాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించి గొప్ప మనసు చాటుకుంటున్నారు కవిత.

ఇదీ చదవండి:దేశంలో వరుసగా రెండో రోజూ తగ్గిన కొవిడ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details