మహారాష్ట్రలోని ఓ ఏటీఎంలో భారీ దొంగతనం జరిగింది. ముర్బాద్ పట్టణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు రూ.45 లక్షలు దోచుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు.
దొంగతనానికి పాల్పడిన దుండగులు యంత్రాన్ని పగలగొట్టకుండానే డబ్బును కాజేశారని థానే పోలీసులు తెలిపారు. ఆ ఏటీఎంలో రూ.45 లక్షల సొమ్ము ఉన్నట్లు బ్యాంకు అధికారులు చెప్పారు.