దేశవ్యాప్తంగా కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 68,631 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి మరో 503 మంది మరణించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా కోరలు చాస్తోంది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 30,596 మంది వైరస్ బారిన పడ్డారు. కొవిడ్ ధాటికి మరో 129 మరణాలు సంభవించాయి.
'మహా'లో కరోనా కల్లోలం- కొత్తగా 68వేల కేసులు - గుజరాత్లో కరోనా కేసుల సంఖ్య
దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. మహారాష్ట్రలో ఆదివారం ఒక్కరోజే 68,631 కేసులు నమోదయ్యాయి. వైరస్ ప్రభావానికి మరో 503 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ కరోనా కోరలు చాస్తోంది. కొత్తగా 30,596 మంది వైరస్ బారినపడ్డారు. దిల్లీలో ఒక్కరోజే 25వేల కేసులు వెలుగుచూశాయి.
కరోనా కల్లోలం
మిగతా రాష్ట్రాల్లో ఇలా..
- దిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 25,462 కరోనా కేసులు వెలుగుచూశాయి. వైరస్‌తో 161 మంది ప్రాణాలు కోల్పోయారు. (పాజిటివిటి రేటు 29.74) శాతంగా ఉంది.
- కర్ణాటకలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 19,067 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి మరో 81 మంది మరణించారు.
- కేరళలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. కొత్తగా 18,257 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొవిడ్ కారణంగా 25 మంది మరణించారు.
- గుజరాత్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్తగా 10,340 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 110 మంది వైరస్‌తో మరణించారు.
- రాజస్థాన్‌లో కొత్తగా 10,514 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 42 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ఉత్తరాఖండ్‌లో ఆదివారం కొత్తగా 2,630 మంది వైరస్ నిర్ధరణ అయింది. వైరస్‌తో 12 మంది మరణించారు.
ఇదీ చదవండి :'కరోనా కట్టడిలో మోదీ విఫలం.. రాజీనామా చేయాలి'