దేశంలో కొవిడ్-19 పంజా విసురుతోంది. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 67,468 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కరోనాతో మరో 568 మంది మరణించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా పంజా విసురుతోంది. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 33,214 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ ధాటికి మరో 187 మంది మరణించారు.
'మహా' విలయం- ఒక్కరోజే 67,468 మందికి కరోనా - కర్ణాటక కరోనా కేసులు
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 67,468 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. కరోనాతో మరో 568 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక్కరోజే 33,214 కరోనా కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 23,558, కేరళలో 22,414 మందికి కరోనా నిర్ధరణ అయింది.
కరోనా కేసులు
మిగతా రాష్ట్రాల్లో ఇలా..
- కర్ణాటకలో కొవిడ్ కోరలు చాస్తోంది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 23,558 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 116 మంది బలయ్యారు.
- కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఒక్కరోజే 22,414 మంది కరోనా బారినపడ్డారు. వైరస్ ధాటికి మరో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రాజస్థాన్‌లో కొత్తగా 14,622 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కరోనా బారినపడి మరో 62 మంది వైరస్‌తో మరణించారు.
- మధ్యప్రదేశ్‌లో కొత్తగా 13,107 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో కొత్తగా 75 మంది ప్రాణాలు కోల్పోయారు.
- గుజరాత్లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 12,553 కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 125 మంది వైరస్‌తో మరణించారు.
- తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 11,681 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. వైరస్ ధాటికి మరో 53 మంది ప్రాణాలు కోల్పోయారు.
- బంగాల్లో కొత్తగా 10,784 మంది వైరస్ సోకింది. కొవిడ్ కారణంగా మరో 58 మంది మరణించారు.
- ఉత్తరాఖండ్‌లో కొత్తగా 4,807 మంది కరోనా బారినపడ్డారు. వైరస్ ధాటికి మరో 34 మరణించారు.
ఇదీ చదవండి :ఆ నాలుగు రాష్ట్రాల్లో.. అందరికీ టీకా ఉచితంగానే