మహారాష్ట్రలో కరోనా విజృంభణ అంతకంతకూ పెరుగుతోంది. శనివారం కొత్తగా 67,123 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వైరస్ బారినపడి మరో 419 మంది మరణించారు. దీంతో మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,47,933కు చేరింది. మరణాల సంఖ్య 59,970కు చేరువైంది. ఒక్క ముంబయిలోనే కొత్తగా 8,834 కేసులు నమోదవ్వటం.. వైరస్ తీవ్రతను కళ్లకు కడుతోంది.
'మహా'లో కరోనా ఉగ్రరూపం- కొత్తగా 67,123 కేసులు
మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శనివారం కొత్తగా 67,123 మందికి పాజిటివ్ నిర్ధరణ అయింది. వైరస్‌తో 419 మంది మరణించారు. యూపీలోనూ ఒక్కరోజే 27వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కేరళలో రికార్డు స్థాయిలో 13వేల మందికి పైగా వైరస్ బారినపడ్డారు.
మహారాష్ట్రలో 67, 123 మందికి పాజిటివ్
మిగతా రాష్ట్రాల్లో ఇలా..
- ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శనివారం కొత్తగా 27,357 కరోనా కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 120 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దిల్లీలో కరోనా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశరాజధానిలో కొత్తగా 24,375 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 167 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో కొత్తగా 17,489 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి మరో 80 మంది మృతిచెందారు.
- కేరళలో రికార్డు స్థాయిలో ఒక్కరోజులో 13,835 మంది కరోనా బారినపడ్డారు. వైరస్‌తో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మధ్యప్రదేశ్‌లో శనివారం కొత్తగా 11,269 కరోనా కేసులు నమోదుకాగా.. వైరస్ ప్రభావానికి మరో 66 మంది మరణించారు.
- గుజరాత్లో కొత్తగా 9,541మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొవిడ్ ధాటికి మరో 97 మంది బలయ్యారు.
- తమిళనాడులో కొత్తగా 9,344 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 39 మంది మరణించారు.
- ఉత్తరాఖండ్‌లో మరో 2,757 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొవిడ్ ధాటికి మరో 37మంది మరణించారు.
- గోవాలో కొత్తగా 762 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో నలుగురు మరణించారు.
- కుంభమేళాలో పాల్గొన్న 175 సాధువులు శనివారం కరోనా బారినపడినట్లు హరిద్వార్ ప్రధాన వైద్యాధికారి డా. ఎస్కే జా తెలిపారు. ఇప్పటివరకు 229 సాధువులు కొవిడ్-19 బారిన పడినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి :'దిల్లీలో పరిస్థితులు మరింత ఆందోళకరం'
Last Updated : Apr 17, 2021, 10:33 PM IST