దేశంలో కరోనా కోరలు చాస్తోంది. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 67,013 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. కరోనాతో మరో 568 మంది మరణించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో వైరస్ పంజా విసురుతోంది. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 34,379 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ ధాటికి మరో 195 మంది మరణించారు.
మిగతా రాష్ట్రాల్లో కేసులు ఇలా..
- కర్ణాటకలో కొవిడ్ పంజా విసురుతోంది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 25,795 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 123 మంది బలయ్యారు.
- కేరళలో గురువారం ఒక్కరోజే 26,995 మంది కరోనా బారినపడ్డారు. వైరస్ ధాటికి మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
- గుజరాత్లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 13,105 కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో 137 మంది వైరస్‌తో మరణించారు.
- తమిళనాడులో కొత్తగా 12,652 మందికి వైరస్ పాజిటివ్ నిర్ధరణ అయింది. మరో 59 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మధ్యప్రదేశ్‌లో గురువారం ఒక్కరోజే 12,384 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 75 మంది ప్రాణాలు కోల్పోయారు.