దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. మహారాష్ట్రలో రోజూవారీ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. కొత్తగా 66,836 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కరోనా బారిన పడి మరో 773 మంది మరణించారు. ఒక్క ముంబయి నగరంలోనే 7,221 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కరోనాతో మరో 72 మంది మరణించారు. నాగ్‌పుర్ జిల్లాలో కొత్తగా 7,485 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కరోనా ప్రభావానికి మరో 82 మంది మరణించారు.
'మహా' విలయం- ఒక్కరోజే 66,836 మందికి వైరస్ - మధ్యప్రదేశ్ కరోనా కేసులు
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కొత్తగా 66,836 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కరోనా బారిన పడి మరో 773 మంది మరణించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కొత్తగా 37,238 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కేరళలో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 28,447 కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్ర కేసులు
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
- ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 37,238 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొవిడ్ ధాటికి మరో 199 మంది మరణించారు.
- కేరళలో కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 28,447 కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 27 మంది బలయ్యారు.
- కర్ణాటకలో కొత్తగా 26,962 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి మరో 190 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రాజస్థాన్‌లో కొత్తగా 15,398 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొవిడ్‌తో మరో 64 మంది మరణించారు.
- తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 13,776 మంది వైరస్ బారిన పడ్డారు. కొవిడ్ కారణంగా మరో 78 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మధ్యప్రదేశ్‌లో కొత్తగా 13,590 మంది వైరస్ బారిన పడ్డారు. వైరస్‌తో మరో 74 మంది మరణించారు.
- బంగాల్లో కొత్తాగా 12,876 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా 59 మంది మరణించారు. దీంతో బంగాల్లో మొత్తం కేసుల సంఖ్య 7,13, 780కు చేరింది.
- ఉత్తరాఖండ్‌లో కొత్తగా 4,339 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ ధాటికి మరో 49 మంది మరణించారు.
ఇదీ చదవండి :'ప్రాణాలు పోతున్నా ఆక్సిజన్ ఉత్పత్తి చేయరా?'
Last Updated : Apr 23, 2021, 10:11 PM IST