దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మహారాష్ట్రలో కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదవుతున్నాయి. బుధవారం కొత్తగా 31 వేల 855 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటినుంచి ఆ రాష్ట్రంలో నమోదైన రోజువారి కేసుల్లో ఇవే అత్యధికం. వైరస్ ధాటికి మరో 95 మంది ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలో కేసులు..
- మొత్తం కేసులు:25,64,881
- మొత్తం రికవరీలు:22,62,593
- మొత్తం మరణాలు: 53,684
- యాక్టివ్ కేసులు: 2,47,299
ముంబయిలో కేసులు..
మహారాష్ట్రలోని ముంబయి నగరంలో 5,185 మందికి తాజాగా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో ఆరుగురు వైరస్‌కు బలయ్యారు.
- మొత్తం కేసులు: 3,74,611
- మొత్తం రికవరీలు: 3,31,322
- మొత్తం మరణాలు: 11,606
- యాక్టివ్ కేసులు: 30,760
దిల్లీలో కేసులు..
దిల్లీలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా మరో 1,254 మందికి వైరస్ సోకింది. మరో ఆరుగురు మృతి చెందారు.
- మొత్తం కేసులు: 6,51,227
- మొత్తం రికవరీలు:6,35,364
- మొత్తం మరణాలు:10,973
- యాక్టివ్ కేసులు: 4890