దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో మహమ్మారి విజృంభిస్తోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 28 వేల 699 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 132 మంది ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 25,33,026
- మొత్తం రికవరీలు: 22,47,495
- మొత్తం మరణాలు: 53,589
గుజరాత్లో కేసులు..
గుజరాత్లో మహమ్మారి మొదలైనప్పటి నుంచి నేటి వరకు రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 1,730 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
- మొత్తం కేసులు: 2,90,379
- మొత్తం రికవరీలు: 2,77,603
- మొత్తం మరణాలు: 4,458
- యాక్టివ్ కేసులు: 8,318
దిల్లీలో కేసులు..