తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చరిత్రలో తొలిసారి నీట మునిగిన జ్యోతిర్లింగం - భీమశంకర ఆలయంలోకి వరద నీరు

భీకర వర్షాల ధాటికి పుణెలోని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన భీమశంకర ఆలయంలోకి వరదనీరు ప్రవేశించింది. దీంతో చరిత్రలో తొలిసారిగా.. శివలింగం నీట మునిగింది.

floods in pune bhimashankara temple
నీట మునిగిన జ్యోతిర్లింగం

By

Published : Jul 23, 2021, 8:15 AM IST

నీట మునిగిన భీమ శంకర ఆలయంలో శివలింగం

మహారాష్ట్ర పుణెలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన భీమశంకర ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. దీంతో చరిత్రలో తొలిసారి శివలింగం నీట మునిగింది.

భీమశంకర్​ ప్రాంతంలో కొద్ది రోజులుగా.. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సమీప ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భీమశంకర ఆలయ పునరుద్ధరణ పనులు జరుగుతున్న క్రమంలోనే ఈ వర్షాలు కురవడం వల్ల.. వరదనీరు ఆలయంలోకి ప్రవేశించింది.

నీట మునిగిన శివలింగం

గతంలో ఎప్పుడూ జరగలేదు..

ఆలయం పక్కనే ఉన్న కొండ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున వరదనీరు.. ఆలయంలోకి ప్రవేశిస్తోందని స్థానికులు తెలిపారు. గతంలో ఎప్పుడూ శివలింగం ఇలా నీట మునగలేదని చెప్పారు.

ఇదీ చూడండి:భారీ వర్షాలకు మహారాష్ట్ర విలవిల- ఠాక్రేకు ప్రధాని ఫోన్​

ఇదీ చూడండి:వర్ష బీభత్సం- స్తంభించిన రవాణా

ABOUT THE AUTHOR

...view details