తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెరుగుతున్న శిందే బలం.. మరికొంతమంది ఎమ్మెల్యేలు అసోంకు..

It said Bharat Gogawale has been appointed as Chief Whip of the party. Following the political crisis, Shiv Sena had removed Eknath Shinde as the party's legislative party leader. However, the rebels have hit back with the resolution. The resolution said that Shiv Sena's ideology has been compromised in the past two years.

Maharashtra political crisis 3 more MLAs reach Guwahati joins Shinde camp
Maharashtra political crisis 3 more MLAs reach Guwahati joins Shinde camp

By

Published : Jun 23, 2022, 11:29 AM IST

Updated : Jun 23, 2022, 10:03 PM IST

22:01 June 23

తిరుగుబాటు నేత ఏక్​నాథ్ శిందే క్యాంపునకు వెళ్తున్న ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరి కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు గువాహటిలో రెబల్స్ ఉన్న హోటల్​కు చేరుకున్నారు. వీరితో కలిపి శివసేన రెబల్ ఎమ్మెల్యేల సంఖ్య 37 దాటింది. దీంతో వీరే అసలైన శివసేన శాసనపక్షంగా ఏర్పడే అవకాశం లభించింది.

20:08 June 23

'అసెంబ్లీలో తేల్చుకుందాం' రెబల్స్​కు శరద్ పవార్ సవాల్!
శివసేన తిరుగుబాటు నేత ఏక్​నాథ్ శిందే సహా రెబల్ ఎమ్మెల్యేలు ముంబయికి రావాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సూచించారు. ఒక్క బలపరీక్ష ద్వారానే మహారాష్ట్ర సర్కారు మైనారిటీలో ఉందని నిరూపించవచ్చని పేర్కొన్న ఆయన.. రెబల్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి వచ్చి హాజరుకావాలని సవాల్ విసిరారు. 'ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మద్దతు ఇవ్వాలని మహావికాస్ అఘాడీ నిర్ణయించింది. శివసేన ఎమ్మెల్యేలు ముంబయికి తిరిగి వస్తే పరిస్థితిలో మార్పు వస్తుంది. రెబల్ ఎమ్మెల్యేలను గుజరాత్​కు, అక్కడి నుంచి అసోంకు ఎలా తీసుకెళ్లారో అందరికీ తెలుసు. అసోం ప్రభుత్వం వారికి మద్దతు ఇస్తోంది. ఇంకా ఎవరి పేర్లనూ ప్రస్తావించాల్సిన అవసరం లేదు' అని పవార్ పేర్కొన్నారు.

14:04 June 23

మొత్తం 42 మంది ఎమ్మెల్యేలు:శివసేన నేత, మహారాష్ట్ర మంత్రి ఏక్​నాథ్​ శిందే వెంట మొత్తం 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 35 మంది శివసేనకు చెందినవారుకాగా.. మరో ఏడుగురు స్వతంత్రులు. అసోం గువాహటిలోని రాడిసన్​ బ్లూ హోటల్​లో వీరంతా గ్రూప్​గా ఉన్న ఉన్న దృశ్యాలు వైరల్​ అవుతున్నాయి. గ్రూప్​ ఫొటో కూడా దిగారు.

11:34 June 23

టీఎంసీ నిరసన:రాడిసన్​ హోటల్​ బయట.. అసోం తృణమూల్​ కాంగ్రెస్​ నేతలు నిరసన చేస్తున్నారు. రాష్ట్ర టీఎంసీ అధ్యక్షుడు రిపున్​ బోరా దీనికి నేతృత్వం వహిస్తున్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న టీఎంసీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర ప్రజలు వరదలతో అతలాకుతలమవుతుంటే.. సీఎం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు.

11:32 June 23

హోటల్​కు అసోం మంత్రి..అసోంలోని మంత్రి అశోక్​ సింఘాల్​.. ఏక్​నాథ్​ శిందే వర్గం బస చేస్తున్న రాడిసన్​ బ్లూ హోటల్​కు చేరుకున్నారు. భాజపా నేత వెళ్లడంతో.. ఏం జరుగుతుందా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

11:31 June 23

రాడిసన్​ బ్లూ హోటల్లో..శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా అసోం గువాహటిలోని రాడిసన్​ బ్లూ హోటల్​లో మకాం వేశారు. ముంబయి నుంచి బుధవారం బయల్దేరిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా శివసేన క్యాంప్​లో ఏక్​నాథ్​ శిందేతో కనిపించారు.

11:19 June 23

'మహా' సంక్షోభం.. శిందేకు పెరుగుతున్న బలం.. అసోంలోనే మకాం!

Maharashtra Political Crisis: మహారాష్ట్ర అధికార సంకీర్ణ కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన శివసేన పార్టీలో చీలిక తప్పేలా కనిపించట్లేదు. పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటుకు దిగిన ఏక్‌నాథ్‌ శిందే శిబిరంలో ప్రస్తుతం 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు శిందేకు మద్దతుగా గురువారం ఉదయం ముంబయి నుంచి గువాహటి చేరుకున్నారు. 42 మందిలో 8 మంది స్వతంత్రులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం ప్రకారం.. తమపై చర్యలు తీసుకోకుండా 37 మంది ఎమ్మెల్యేల(2/3 వంతు) మెజార్టీని నిరూపించుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు అసమ్మతి నేతలతో శిందే నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత గవర్నర్‌ను సంప్రదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఆ 13 మంది తప్ప అంతా మావైపే: శిందే..
అసమ్మతి ఎమ్మెల్యేల నాయకుడిగా ఉన్న తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే మీడియాతో మాట్లాడారు. శివసేనకు అసెంబ్లీలో 55 మంది ఎమ్మెల్యే ఉన్నారని, అందులో 13 మంది మినహా అంతా తమ వర్గంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. అసలైన శివసేన పార్టీ తమదేనని పేర్కొన్నారు. తాను ఇంకా శివసేన శాసనసభాపక్ష నేతనే అని తెలిపారు.

ఎన్సీపీ, శివసేన సమావేశాలు..
మరోవైపు, రాజకీయ అనిశ్చితిని తొలగించేందుకు అటు శివసేన, ఎన్సీపీ పార్టీలు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఉదయం 11.30 గంటలకు ఉద్ధవ్‌ ఠాక్రే తన వర్గం ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఠాక్రే రాజీనామా చేయడం ఖాయమేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బుధవారం రాత్రి ఠాక్రే అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి తన సొంత నివాసానికి మారడం ఈ ఊహాగానాలకు మరింత బలమిచ్చింది. దీంతో నేటి సమావేశంలో రాజీనామాపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, సంక్షోభంపై ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కూడా తమ నేతలతో భేటీకి పిలుపునిచ్చారు.

Last Updated : Jun 23, 2022, 10:03 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details