Maharashtra petrol price cut: ధరల భారంతో సతమతమవుతున్న ప్రజలకు శుభవార్త చెప్పారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే. లీటర్ పెట్రోల్ ధరను రూ.5, డీజిల్ ధరను రూ.3 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం విధించే విలువ ఆధారిత పన్ను(వ్యాట్) తగ్గించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఈమేరకు ఊరట కలిగిస్తున్నట్లు తెలిపారు.
'మహా' గుడ్ న్యూస్.. లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు
Maharashtra petrol price cut: మహారాష్ట్ర ప్రజలకు ఊరట కలిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే. లీటర్ పెట్రోల్ ధరను రూ.5, డీజిల్ ధరను రూ.3 మేర తగ్గించారు.
వ్యాట్ తగ్గింపు ప్రతిపాదనకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని.. గురువారం మంత్రివర్గ సమావేశం అనంతరం వెల్లడించారు ఏక్నాథ్ శిందే. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.6000 కోట్లు భారం పడుతుందని వివరించారు. "పెట్రోల్ ధరల తగ్గింపు.. ప్రజా సంక్షేమం పట్ల భాజపా-శివసేన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం" అని అన్నారు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్.
గురువారం ఉదయం ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.33, డీజిల్ ధర రూ.97.26గా ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధర రూ.5, డీజిల్ ధర రూ.3 మేర తగ్గనుంది.