తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బావిలో తల్లి, ముగ్గురు చిన్నారుల మృతదేహాలు.. ఏం జరిగింది? - maharashtra murder case

తల్లి సహా ఆమె ముగ్గురు పిల్లల మృతదేహాలు బావిలో కనిపించడం మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​లో సంచలనంగా మారింది. మృతదేహాలను వెలికితీసిన అధికారులు.. వీరి మృతిపై అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Maharashtra News
recent suicidal deaths

By

Published : Mar 5, 2022, 4:49 PM IST

Maharashtra News: మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​లో ఓ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి సహా ఆమె ముగ్గురు చిన్నారులు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. నాలుగు మృత దేహాలను బాధితుల ఇంటి సమీపంలోని బావి నుంచి వెలికితీశారు.

ఏం జరిగిందంటే?

తన్వీ, భాగ్యశ్రీ

బాలసాహెబ్​ గణ్​పత్​ ధొకారే, అతడి భార్య స్వాతి (28), కూతుళ్లు భాగ్యశ్రీ (5), తన్వీ (3), కుమారుడు శివం (6 నెలలు).. ఖూడే గ్రామంలో నివసిస్తున్నారు. ఇటీవలే స్వాతి సహా ముగ్గురు పిల్లల మృతదేహాలు వారి ఇంటి సమీపంలోని ఓ బావిలో కనిపించాయి. వాటిని బయటకు తీసిన అధికారులు.. ఈ వ్యవహారంపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:లోయలోకి దూసుకెళ్లిన ఎస్​యూవీ.. అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details