తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శవాన్ని ముక్కలుగా నరికి.. కుక్కర్​లో ఉడకబెట్టి.. మిక్సీ పట్టి.. లివిన్ పార్ట్​నర్ దారుణ హత్య! - uttar pradesh girl killed

Maharashtra Murder Case : శ్రద్ధవాకర్ తరహా ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది. సహజీవనం చేస్తున్న మహిళను దారుణంగా హత్య చేసి.. ఆమె శరీర భాగాలను ముక్కలుగా చేశాడు ఓ వ్యక్తి. వాటిని కుక్కర్​లో ఉడికించి, మిక్సీలో వేసి గ్రైండ్ చేశాడు. మరో ఘటనలో.. ముగ్గురు కామాంధులు బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను రోడ్డుపై పడేశారు. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల బాలిక మరణించింది. ఈ దారుణమైన ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లో జరిగింది.

Maharashtra Murder Case
బాలికపై గ్యాంగ్​రేప్

By

Published : Jun 8, 2023, 10:59 AM IST

Updated : Jun 8, 2023, 12:24 PM IST

Maharashtra Murder Case : మహారాష్ట్రలో శ్రద్ధవాకర్ తరహా దారుణ హత్యోదంతం వెలుగుచూసింది. సహజీవనం చేస్తున్న మహిళను 56ఏళ్ల వ్యక్తి కొట్టి చంపాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని.. ముక్కలు చేశాడు. అనంతరం ఆ శరీర భాగాలను కుక్కర్​లో ఉడికించాడు. కొన్ని శరీర భాగాలను మిక్సీలో మిక్సీలో వేసి గ్రైండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మనోజ్ సహాని అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

హత్యచేసి శరీర భాగాలను ముక్కలుగా కోసిన హంతకుడు

ఠాణెలోని మీరా భయందర్ ప్రాంతంలో ఉన్న ఆకాశగంగా భవనంలో 32 ఏళ్ల సరస్వతి వైద్య, 56 ఏళ్ల మనోజ్ సహాని మూడేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఆకాశగంగా భవనంలో భరించలేని దుర్వాసన వస్తోందంటూ పోలీసులకు ఆ భవనంలో ఉండే వారు ఫోన్ చేశారు. నయానగర్ పోలీసులు వెళ్లి పరిశీలించగా సరస్వతి హత్యకు గురైనట్లు గుర్తించారు. ముక్కలు చేసిన ఆమె మృతదేహ భాగాలను కనుగొన్నారు. మృతదేహ భాగాలను అక్కడి నుంచి తరలించారు. నిందితుడు మనోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. హత్య మూడు, నాలుగు రోజుల క్రితం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని, స్థానిక డీసీపీ జయంత్‌ బజబలే చెప్పారు.

శరీర భాగాలను సంచిలో పోస్టు మార్టం పరీక్షల కోసం తీసుకెళ్తున్న పోలీసులు

"నిందితుడు మనోజ్ సాహ్నీ మూడు నాలుగు రోజుల క్రితం సరస్వతి వైద్యను చంపేసి ఉంటాడు. ఆ తర్వాత చెట్లను నరికే యంత్రాన్ని కొనుక్కొని వచ్చి మృతదేహాన్ని ముక్కలు చేశాడు. మృతదేహం భాగాలను ప్రెజర్ కుక్కర్​లో ఉడికించాడు. బయటపడేసే ఉద్దేశంతో వాటిని ప్లాస్టిక్ బ్యాగుల్లో నింపాడు. ఘటనాస్థలి నుంచి 12-13 శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నాం."
-పోలీసులు

స్పందించిన ఎన్​సీపీ ఎంపీ..
ఈ దారుణమైన ఘటనపై ఎన్​సీపీ నాయకురాలు, ఎంపీ సుప్రియ సూలే స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 'భాగస్వామిని దారుణంగా చంపి శరీర భాగాలను ఉడికించారు. మిక్సర్​లో గ్రైండ్ చేశారు. ఇది అత్యంత పాశవికమైన హత్య. జరిగిన ఘటన అమానవీయమైనది. రాష్ట్రంలో నేరస్థులకు.. న్యాయస్థానం, చట్టాల పట్ల భయం లేదు అనేదానికి ఈ భయంకరమైన ఘటనే ఉదాహరణ. రోజురోజుకు మహిళలపై దాడులు పెరుగుతున్నాయి. ఇది బాధాకరం. ఈ కేసులో నిందితుడ్ని ఫాస్ట్​ట్రాక్​ కోర్టులో హాజరుపరిచి మరణ శిక్ష విధించేలా దర్యాప్తు సంస్థలు పనిచేయాలి' అంటూ ఎంపీ సుప్రియ తన ట్విట్టర్​లో ట్వీట్​ చేస్తూ.. ముఖ్యమంత్రి కార్యాలయానికి, హోంమంత్రి దేవేంద్ర ఫడణవీస్​కు ట్యాగ్​ చేశారు.

UP Rape Case : మరోవైపు యూపీ, బస్తీ జిల్లా గౌర్​ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఓ బాలికపై గ్యాంగ్​రేప్ జరిగింది. ఈ ఘటనలో బాలిక మృతిచెందింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో రోడ్డుపై బాలిక మృతదేహం లభ్యం కావడం పోలీస్ వర్గాల్లో కలకలం రేపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనకు సంబంధించిన నిందితుల్లో ఒకడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా..మిగిలిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయకపోవడం పట్ల ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు బుధవారం బీరాపుర్ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. పోలీసులు కలగజేసుకొని మిగిలిన ఇద్దరిని అరెస్ట్​ చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
బీరాపుర్​కు చెందిన మోను సాహ్నీ, రాజ్​ నిషాద్, కుందన్ సింగ్ ముగ్గురు స్నేహితులు. గౌర్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో కుందన్ సింగ్​కు ఇల్లు ఉంది. ఆ ఇల్లు ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. అయితే నిందితుల్లో ఒకడైన మోను సాహ్నీకి, మృతిచెందిన బాలికతో ఆరు నెలల కిందటే పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు.

ఈ క్రమంలో మోను సాహ్నీ సోమవారం బాలికను కుందన్ సింగ్ ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లోకి చేరుకోగానే.. ఇద్దరు స్నేహితులతో కలిసి మోను.. బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. రేప్​కు గురైన బాలికకు తీవ్ర రక్తస్రావం కావడం వల్ల ఆమెను గదిలో నుంచి తీసుకొచ్చి రోడ్డుపై వదిలేశారు. రక్తపు మడుగులో ఉన్న బాలిక రోడ్డుపైనే ప్రాణాలు విడిచింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుల్లో ఒకడిని పోలీసులు అరెస్ట్​ చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కాగా బాలిక రేప్​ కారణంగానే మరణించినట్లు పోస్ట్​ మార్టం నివేదికలో తేలింది. ఘటన జరిగిన స్థలం నుంచి మరిన్ని ఆధారాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు.

'గౌర్ పోలీస్​ స్టేషన్ పరిధిలో బాలిక రేప్​కు గురైంది. బాలిక మృతి పట్ల చింతిస్తున్నాను. ఇది చాలా బాధాకరం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుల్లో ఒకడిని పట్టుకున్నాము. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నాము. త్వరలోనే వారిని పట్టుకొని చట్టపరంగా శిక్షిస్తాం.'
-ఏఎస్​పీ దీపేంద్ర చౌదరి.

నిందితులు ముగ్గురూ అధికార పార్టీకి చెందిన వారే..
అయితే అత్యాచారంతో సంబంధం ఉన్న ముగ్గురు కూడా బీజేపీ పార్టీకి చెందిన వారని స్థానికులు చెబుతున్నారు. గౌర్ మండల బీజేపీ కిసాన్ మెర్చా ఉపాధ్యాక్షుడి హోదాలో ఉన్న కుంథన్ సింగ్ పరారీలో ఉన్నాడని చెప్పారు.

Last Updated : Jun 8, 2023, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details