మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సంజయ్ రాఠోడ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు అందించారు. ఫిబ్రవరి 8న జరిగిన ప్రముఖ మోడల్ పూజా చౌహాన్ ఆత్మహత్య కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
దీనినే ప్రధానాస్త్రంగా చేసుకొని ప్రతిపక్ష భాజపా విమర్శలు చేస్తోంది. ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. భాగస్వామ్య పార్టీలైన ఎన్సీపీ, కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి ఒత్తిడి పెరగటం వల్ల ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న శివసేన తమ పార్టీకి చెందిన రాఠోడ్తో రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది.