మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండే మరోసారి కరోనా బారినపడ్డారు. ఆయనకు కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు మంగళవారం రాత్రి తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కొద్దిరోజులుగా తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని కోరారు. గతేడాది జూన్ 12న తొలిసారి ముండేకు కరోనా సోకింది. కొద్ది రోజుల అనంతరం కోలుకున్నారు.
'' రెండోసారి నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కొద్దిరోజులుగా నాతో సన్నిహితంగా మెలిగిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. భయపడాల్సిన పనిలేదు. అందరూ మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండండి.''
- ధనంజయ్ ముండే, మహారాష్ట్ర మంత్రి