మహారాష్ట్ర మంత్రి, భాజపా సీనియర్ నేత చంద్రకాంత్‌పాటిల్‌పై ఓ దుండగుడు సిరాతో దాడి చేశాడు. పుణెలోని మిమ్రీ పట్టణంలో ఆయన పర్యటిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. డా.బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే పై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మంత్రిపై దుండగుడు సిరా చల్లిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా మంత్రిని అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలోనే కొందరు ఆందోళనకారులు నల్ల జెండాలతో నిరసన తెలిపేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
అంబేడ్కర్, పూలేపై అనుచిత వాఖ్యలు.. మహారాష్ట్ర మంత్రిపై సిరాతో దాడి - భాజపా సీనియర్ నేత చంద్రకాంత్‌పాటిల్
మహారాష్ట్ర మంత్రి, భాజపా సీనియర్ నేత చంద్రకాంత్‌పాటిల్‌పై ఓ దుండగుడు సిరాతో దాడి చేశాడు. పుణెలోని మిమ్రీ పట్టణంలో ఆయన పర్యటిస్తుండగా ఈ ఘటన జరిగింది.
శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి చంద్రకాంత్ పాటిల్ మాట్లాడుతూ "విద్యాలయాల అభివృద్ధి కోసం అప్పట్లో అంబేడ్కర్, పూలే ప్రభుత్వ నిధులను కోరలేదని, పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించాలంటే ప్రజలంతా ఒక్కటై నిధులు 'యాచించారు'" అని వ్యాఖ్యానించారు. ఇక్కడ 'యాచించడం' అనే పదం వివాదాస్పదమైంది. దీనిపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా స్పందించారు. మంత్రి వ్యాఖ్యలను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ప్రజలే నిధులు సమకూర్చకోవాలని చెప్పడం మంత్రి ఉద్దేశమని వివరణ ఇచ్చారు.