తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో ఒమిక్రాన్​ కేసు- దేశంలో నాలుగోది - కరోనా కేసులు

Omicron
మహారాష్ట్రలో ఒమిక్రాన్​ కేసు

By

Published : Dec 4, 2021, 7:18 PM IST

Updated : Dec 4, 2021, 9:42 PM IST

19:16 December 04

మహారాష్ట్రలో ఒమిక్రాన్​ కేసు- దేశంలో నాలుగోది

భారత్​లో మరో ఒమిక్రాన్​ కేసు నమోదైంది. దక్షిణాఫ్రికా నుంచి ముంబయికి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్​ పాజిటివ్​గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. నవంబరు 23న దుబాయ్​ నుంచి దిల్లీ చేరుకున్న వ్యక్తి.. ఎయిర్​పోర్ట్​లో కొవిడ్​ టెస్ట్​ చేయించుకుని 24న ముంబయి వెళ్లాడని అధికారులు వెల్లడించారు. అతను ముంబయిలోని కల్యాణ్​ డోంబివిలీ మున్సిపల్​ ఏరియాకు చేరుకున్నట్లు తెలిపారు. బాధితుడిలో జ్వరం తప్ప ఇతర లక్షణాలు ఏవీ తెలియలేదని పేర్కొన్నారు.

ఒమిక్రాన్​ సోకిన వ్యక్తితో మరో నలుగురు వచ్చారని.. ప్రస్తుతం వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒమిక్రాన్​ సోకిన వ్యక్తిని కలిసిన వారిలో హైరిస్క్​గా భావించిన 12 మందికి పరీక్షలు నిర్వహించగా నెగటివ్​ వచ్చిందని తెలిపారు. మరో 23 మందిని కూడా పరీక్షించగా నెగటివ్​ అని తేలినట్టు వెల్లడించారు. ఇప్పటివరకు వివిధ దేశాల నుంచి డోంబివిలీకి వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటివ్​ వచ్చిందని.. అయితే అది ఒమిక్రాన్​ అని నిర్ధరణ కాలేదని పేర్కొన్నారు.

ఇది మహారాష్ట్రలోనే తొలి ఒమిక్రాన్​ కేసు కాగా దేశంలో నాలుగోది. కర్ణాటక, గుజరాత్​లలో కూడా ఒమిక్రాన్​ కేసులను గుర్తించారు అధికారులు.

రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు

వారాంతపు పాజిటివిటీ రేటు-మరణాలకు అధికంగా ఉన్న రాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్రం. అంతర్జాతీయ ప్రయాణికులు, కేసుల సంఖ్య పెరుగుతున్న ప్రాంతాలు, కాంటాక్ట్​ ట్రేసింగ్​లపై దృష్టి సారించాలని పేర్కొంది.

కర్ణాటక, కేరళ, తమిళనాడు, జమ్ముకశ్మీర్, మిజోరం, ఒడిశాల్లో పాజిటివీ రేటు అధికంగా ఉన్నందును కట్టడి చర్యలు పకడ్బంధీగా అమలు చేయాలని సూచించింది కేంద్రం. కేసులను వీలైంత వేగంగా గుర్తించాలని, మౌలికవసతులను సమీక్షించాలని సూచించింది.

ఇంకా నిర్లక్ష్యం..

కొత్త వేరియంట్లతో రోజురోజుకు కరోనా వ్యాప్తి తీవ్రం అవుతున్న ఇంకా చాలా మంది కనీస జాగ్రత్తలు పాటించట్లేదు. లోకల్​ సర్కిల్స్​ అనే ఆన్​లైన్​ సంస్థ నిర్వహించిన సర్వేనే అందుకు ఉదాహరణ. దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు మాస్క్​ లేకుండానే తిరుగుతున్నారని సర్వే వెల్లడించింది. ఏప్రిల్​లో నిర్వహించిన ఈ సర్వేలో మాస్క్​ అవసరమని భావించే వారి సంఖ్య 29 శాతం ఉండగా.. అది సెప్టెంబరు నాటికి 12 శాతం, నవంబరు నాటికి 2 శాతానికి దిగజారినట్లు పేర్కొంది.

Kerala cases today:

కరోనా కేసుల తాకిడి తీవ్రంగా ఉన్న కేరళలో కొత్తగా 4557 కేసులు నమోదయ్యాయి. 5108 మంది కోలుకోగా 52 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా తిరువనంతపురంలో 814 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 51,49,642కి చేరగా.. మృతుల సంఖ్య 41,439గా ఉంది.

Last Updated : Dec 4, 2021, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details