తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండు వారాలకే పాడయిన ఎలక్ట్రిక్ స్కూటర్​.. గాడిదకు కట్టి ఊరేగింపు..! - ఎలక్ట్రిక్ స్కూటర్​ న్యూస్

Electric scooter donkey: ఎలక్ట్రిక్ స్కూటర్​ను గాడిదకు కట్టి ఊరేగించాడు ఓ వ్యక్తి. కొనుగోలు చేసిన రెండు వారాలకే అది పనిచేయడం ఆగిపోయిందని, ఫిర్యాదు చేసినా.. కంపెనీ నుంచి స్పందన లేదని ఈ విధంగా నిరసన తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

man-ties-faulty-electric-scooter-to-donkey
ఎలక్ట్రిక్ స్కూటర్​ని గాడిదకు కట్టి ఊరేగింపు..

By

Published : Apr 26, 2022, 11:37 AM IST

Electric scooter news: మహారాష్ట్ర పర్లీ వైజ్​నాథ్​కు చెందిన ఓ వ్యక్తి వినూత్న రీతిలో చేసిన నిరసన సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అతను ఎలక్ట్రిక్​ స్కూటర్​ను గాడిదకు కట్టి రోడ్డుపై తిప్పాడు. రెండింటికీ, తాళ్లు, బ్యానర్లు కట్టి ఊరేగించాడు. వెనకాల ఉన్న మరో వ్యక్తి స్కూటర్​ను పట్టుకోగా.. నిరససన చేసిన వ్యక్తి గాడిద చెవులు పట్టుకున్నాడు. ఓ బాలుడు గాడిదను చిన్నకర్ర సాయంతో ముందుకునడిపిస్తూ వీరికి సాయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్​చల్​ చేస్తోంది.

ఎలక్ట్రిక్ స్కూటర్​ని గాడిదకు కట్టి ఊరేగింపు..
ఎలక్ట్రిక్ స్కూటర్​ని గాడిదకు కట్టి ఊరేగింపు..

ఏం జరిగింది?:వినూత్నంగా నిరసన చేపట్టిన ఈ వ్యక్తి పేరు సచిన్​ గిట్టే. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్​ ధరలతో విసిగెత్తిపోయాడు. అదే సమయంలో ఎలక్ట్రిక్​ స్కూటర్లకు సంబంధించిన ఆకర్షణీయ ప్రకటనలు చూశాడు. ఇది కొంటే పెట్రోభారం తగ్గుతుందని భావించాడు. గతేడాది సెప్టెంబర్​లో రూ.20,000వేలు అడ్వాన్స్ చెల్లించి ఎలక్ట్రిక్ స్కూటర్​ను బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన రూ.65వేలను ఈ ఏడాది జనవరి 21న కట్టాడు. ఎట్టకేలకు మార్చి 24న స్కూటర్​ ఇంటికి వచ్చింది. అయితే సరిగ్గా రెండు వారాలకే అది పనిచేయడం ఆగిపోయింది. సాంకేతిక సమస్యతో ఏప్రిల్​ 8 నుంచి ఎలక్ట్రిక్​ స్కూటర్​ స్టార్ట్ కావట్లేదు. దీంతో అతను కంపెనీ కస్టమర్​ కేర్​కు ఫోన్ చేశాడు. సంస్థ ప్రతినిధులను సంప్రదించేందుకు ప్రయత్నించాడు. కానీ అటువైపు నుంచి స్పందన సరిగ్గా లేదు. ఓ మెకానిక్​ను పంపించినా.. అతను కూడా స్కూటర్​ను బాగు చేయలేకపోయాడు.

Electric scooter protest: దీంతో విసిగివేసారిన సచిన్ గిట్టే ఒకానొక సమయంలో స్కూటర్​కు నిప్పుపెట్టి తగలబెడదామనుకున్నాడు. ఎలాంటి ఉపయోగం లేని ఈ వాహనం ఎందుకు అనుకున్నాడు. అయితే ఆ ఆలోచన విరమించుకుని కంపెనీపై నిరసన వ్యక్తం చేయాలనుకున్నాడు. అందుకే గాడిదకు స్కూటర్​ను కట్టి బీడ్​లోని రోడ్లపై ఆదివారం తిప్పాడు. ఇప్పుడైనా కంపెనీ స్పందించి తన సమస్యను తీర్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. లేకపోతే వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేస్తానని చెప్పాడు.

ఇదీ చదవండి:16నెలల చిన్నారికి రూ.16 కోట్ల ఇంజెక్షన్​.. సోనూసూద్​ భారీ సాయం

ABOUT THE AUTHOR

...view details