తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో భారీగా తగ్గిన కరోనా కేసులు - మహారాష్ట్ర కరోనా కేసులు

మహారాష్ట్రలో కరోనా కేసులు నెల రోజుల తర్వాత 50వేల మార్క్​కు తక్కువగా నమోదయ్యాయి. సోమవారం కొత్తగా 48,621 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 567 మంది మరణించారు. కర్ణాటకలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 44,438 మందికి వైరస్​ సోకింది. మరో 239 మంది మరణించారు. తమిళనాడులో 20,952 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 122 మంది మహమ్మారి కారణంగా మృతిచెందారు.

corona cases
మహారాష్ట్ర కేసులు

By

Published : May 3, 2021, 9:18 PM IST

దేశవ్యాప్తంగా కరోనా విలయం కొనసాగుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 48,621 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 567 మంది మరణించారు. 30 రోజుల తర్వాత 50 వేలకు తక్కువగా కేసులు నమోదు కాడవం ఇదే తొలిసారి. కర్ణాటకలో కొత్తగా రికార్డు స్థాయిలో 44,438 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 239 మంది మృతి చెందారు. తమిళనాడులోనూ రికార్డు స్థాయిలో 20,952 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మరో 122 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

వివిధ రాష్ట్రాల్లో కేసులు ఇలా..

రాష్ట్రం తాజా కేసులు తాజా మరణాలు
ఉత్తర్​ ప్రదేశ్​ 29,192 288
కేరళ 26,011 45
​ తమిళనాడు 20,952 122
మధ్యప్రదేశ్ 12,062 93
ఉత్తరాఖండ్ 5,403 128
రాజస్థాన్ 17,296 154
ఒడిశా 8,914 5

ఇదీ చదవండి :కేంద్ర విద్యాసంస్థల పరీక్షలు వాయిదా!

ABOUT THE AUTHOR

...view details