మహారాష్ట్రలో భారీ దోపిడీ జరిగింది. ఓ జువెలరీ షాప్లో లూటీకి పాల్పడ్డ దుండగులు.. రూ.7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించినట్టు పోలీసులు తెలిపారు.
పాల్ఘర్- బోయిసర్ ప్రాంతంలో ఓ దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు.. 14 కిలోల బంగారు ఆభరణాలు సహా.. రూ.60లక్షల నగదును దోచుకెళ్లినట్టు వెల్లడించారు పోలీసులు. షాప్ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.