ఫ్యాక్టరీలో పేలుడు- ఇద్దరు కార్మికులు మృతి.. ట్రక్కు దగ్ధం - మహారాష్ట్ర జల్నా స్టీల్ ప్లాంట్

14:18 November 01
ఫ్యాక్టరీలో పేలుడు
మహారాష్ట్ర జాల్నాలోని ఓ స్టీల్ ప్లాంట్‌లో పేలుడు సంభవించగా.. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. జాల్నా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న గీతై స్టీల్ కంపెనీలో ఈ పేలుడు జరిగింది. స్టీల్‌ను కరిగించేందుకు ఉపయోగించే బాయిలర్ పేలినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో జరిగిన పేలుడు ఫలితంగా బాయిలర్ ముక్కలుముక్కలైంది. బాయిలర్ సమీపంలో ఉన్న ఇద్దరు కార్మికులు చనిపోయారు.
ట్రక్కు దగ్ధం
పేలుడు సమయంలో దగ్గర్లో ఉన్న ఓ ట్రక్కు సైతం మంటల్లో కాలిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. స్టీల్ కంపెనీ వద్దకు చేరుకున్నారు. ఘటన ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసేందుకు వివరాలు సేకరిస్తున్నారు.