తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రేమికులుగా దూరమైనా.. మరణంలో ఒక్కటై! - శ్మశానవాటికలో పెళ్లి

వారిద్దరూ ప్రేమించుకున్నారు. కలకాలం కలిసి బతుకుదామనుకున్నారు. కానీ, తమ ప్రేమను సమాజం అంగీకరించదేమోనని భయపడ్డారు. ఇద్దరూ ఒకేసారి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే.. వారి కుటుంబ సభ్యులు మాత్రం మరణించిన తర్వాత వారి మృతదేహాలకు పెళ్లి జరిపించి, అంత్యక్రియలు నిర్వహించారు.

marriage in cremation
శ్మశానవాటికలో పెళ్లి

By

Published : Aug 2, 2021, 9:18 PM IST

ప్రేమలో కలకాలం బతకలేకపోయినా.. చనిపోయిన తర్వాత వివాహంతో ఒక్కటైంది ఓ జంట. తమ ప్రేమను కుటుంబ సభ్యులు, సమాజం అంగీకరించదేమోనన్న భయంతో ప్రేమికులిద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే.. అంత్యక్రియల సమయంలో వారిద్దరి మృతదేహాలకు ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లి జరిపించారు. మహారాష్ట్ర జలగావ్ జిల్లాలో జరిగిందీ ఘటన.

అసలేం జరిగిందంటే..?

జల్​గావ్​ జిల్లాలోని వాడే గ్రామానికి చెందిన యువకుడు ముకేశ్​ కైలాస్ సోనావోనా(22). పాలట్​ గ్రామానికి చెందిన యువతి నేహా బాపు(19). నేహా వాళ్ల మావయ్య గ్రామం వాడేనే కాగా.. ఆమె కుటుంబం కూడా అదే ఊర్లో నివిసిస్తోంది. ఈ క్రమంలో ముకేశ్​, నేహా ఒకరినొకరు ప్రేమించుకున్నారు.

ముకేశ్ ​కైలాస్ సోనావోనా
నేహా బాపు

అయితే.. వాడే గ్రామంలోని ఓ పాఠశాలలో శనివారం రాత్రి ముకేశ్​, నేహా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వీరి మరణవార్త తెలుసుకుని పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం అనంతరం.. ఇరువురి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అయితే.. శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వర్తించే ముందు వారిద్దరికి పెళ్లి జరిపించాలని ఇరు కుటంబాలవారు నిర్ణయించారు. దాంతో చితిపై వారిద్దరికీ పెళ్లి జరిపించి, మృతదేహాలను దహనం చేశారు.

ఇదీ చూడండి:సెలవు ఇవ్వలేదని హత్య- 29 ఏళ్లకు అరెస్ట్

ఇదీ చూడండి:ప్లీజ్.. ఇక్కడ ముద్దులు పెట్టుకోవద్దు!

ABOUT THE AUTHOR

...view details