తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భూమిలో దాచిన రూ.లక్షల సొమ్ము స్వాధీనం - naxals demand cash in maharahstra gadchiroli news

నక్సల్స్​.. భూమిలో దాచిన దాదాపు రూ.16 లక్షల నగదు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

gadchiroli naxals
మహారాష్ట్రలో నక్సల్స్​

By

Published : Jul 3, 2021, 6:24 AM IST

మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లాలో భూమిలో దాచిన రూ.16 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే ప్రాంతంలో పేలుడు పదార్థాలను కూడా గుర్తించాయి బలగాలు.

సంయుక్త ఆపరేషన్​లో..

ఎతాపల్లి తాలుకాలోని కుద్రి అటవీ ప్రాంతంలో గడ్చిరోలీ పోలీసులు, సీ-60 సైనికులు సంయుక్తంగా నక్సల్స్​ వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో రూ.15.96 లక్షలను భూమిలో దాచి ఉంచగా భధ్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. అదే చోట పేలుడు పదార్థాలు కూడా ఉన్నట్లు గుర్తించారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, పేలుడు పదర్థాలు
భూమిలో దాచిన నగదు, మావోయిస్టు కరపత్రాలు
పోలీసులు స్వాధీనం చేసుకున్న డిటోనేటర్లు

ఎలక్రిక్​ బటన్, ఒక స్విచ్చు, మూడు డిటోనేటర్లు, ఒక వాకీ టాకీ, తీగల చుట్టలు, మావోయిస్టు కరపత్రాలను తాము స్వాధీనం చేసుకున్నామని అధికారులు​ తెలిపారు. వాటిని గడ్చిరోలీ పోలీస్​ హెడ్​క్వార్టర్స్​కు తరలించామని చెప్పారు.

"గడ్చిరోలీ జిల్లాలో నక్సల్స్​ తరుచూ హింసాత్మక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటారు. డబ్బుల కోసం ఇక్కడి కాంట్రాక్టర్లనెందరినో వారు హత్య చేశారు. ఇలాగే.. ఎవరి దగ్గరి నుంచో వసూలు చేసిన డబ్బులను వారు భూమిలో దాచి పెట్టారు. దీనిపై క్షుణ్నంగా దర్యాప్తు చేసి, ఈ డబ్బులను ఎవరి దగ్గరి నుంచి వసూలు చేశారో తేలుస్తాం."

-అంకిత్​ గోయల్​, గడ్చిరోలీ ఎస్పీ

నేలలో డబ్బలు దాచిన ఉంచిన వ్యవహారంపై కేసు నమోదు చేశామని ఎస్పీ అంకిత్​ గోయల్​ తెలిపారు.

ఇదీ చూడండి:ఎన్​కౌంటర్​లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

ఇదీ చూడండి:మధ్యప్రదేశ్​లో 'మినీ పాకిస్థాన్' గ్రామం!

ABOUT THE AUTHOR

...view details