మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోలాపుర్ జిల్లాలో శుక్రవారం ఓ ఎస్యూవీ.. ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టిన ఘటనలో.. ఓ 11ఏళ్ల చిన్నారి సహా మొత్తం ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 10మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కొల్హాపుర్ జిల్లా చాంద్గఢ్ వాసులు.. సోలాపుర్ జిల్లా పంధర్పుర్లోని ప్రముఖ విఠల ఆలయాన్ని దర్శించుకునేందుకు ఎస్యూవీలో బయల్దేరగా.. ఉదయం 6 గంటల ప్రాంతంలో సంగోలా-పంధర్పుర్ రోడ్లోని కాసేగావ్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే.. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే.. ఆగి ఉన్న ట్రక్కులోకి ఎస్యూవీ దూసుకెళ్లినట్టు తెలుస్తోంది.