తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వ్యవసాయం గిట్టుబాటు కాట్లేదు.. హెలికాప్టర్ కొనుక్కుంటా లోన్ ఇవ్వండి' - హెలికాప్టర్​ను అద్దెకు తిప్పుతూ వ్యాపారం చేస్తానంటున్న రైతు

farmer helicopter: రూ.6.6 కోట్ల బ్యాంక్ ​లోన్​ కోరాడు ఓ యువ రైతు. వ్యవసాయం గిట్టుబాటు అవ్వట్లేదని, అందుకే హెలికాప్టర్​ కొని అద్దెకి ఇచ్చి డబ్బులు సంపాదిస్తానంటున్నాడు.

farmer helicopter
హెలికాప్టర్

By

Published : Jun 17, 2022, 4:38 PM IST

Updated : Jun 17, 2022, 10:14 PM IST

farmer helicopter: హెలికాప్టర్ కొనుగోలు చేయడానికి రూ.6.6కోట్లు రుణం కావాలని బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నాడు కైలాశ్​ పతంగే అనే యువ రైతు. అతనిది మహారాష్ట్ర ఔరంగాబాద్​లోని తక్టోడా గ్రామం. లోన్​ కోసం గోరేగావ్​లోని ఓ బ్యాంక్​ను ఆశ్రయించాడు.

అసలేం జరిగిందంటే: కైలాశ్​కు రెండు ఎకరాల భూమి ఉంది. అందులో సోయాబీన్​ పంటను గత రెండు సంవత్సరాలుగా పండిస్తున్నాడు. అయితే అకాల వర్షాల వల్ల కొన్నిసార్లు, సమయానికి వర్షాలు కురవకపోవడం వల్ల మరికొన్నిసార్లు వ్యవసాయంలో నష్టాలు చవిచూశాడు. ​అందుకే వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదని వాపోయాడు. హెలికాప్టర్​ కొని అద్దెకు ఇచ్చి డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకుని లోన్​ కోసం బ్యాంక్​ను ఆశ్రయించాడు.

"పెద్ద వ్యక్తులు మాత్రమే పెద్ద కలలు కనాలని ఎవరు చెప్పారు. రైతులు కూడా పెద్ద కలలు కనాలి. హెలికాప్టర్ కొనుగోలు కోసం రూ.6.65 కోట్ల లోన్​ కోసం దరఖాస్తు చేసుకున్నాను. ఇతర వ్యాపారాల్లో తీవ్ర పోటీ ఉంది. అందుకే నేను హెలికాప్టర్​ను కొని అద్దెకు ఇవ్వాలనుకుంటున్నాను."

Last Updated : Jun 17, 2022, 10:14 PM IST

ABOUT THE AUTHOR

...view details