Maharashtra Family Suicide: మహారాష్ట్రలోని నాగ్‌పుర్ జిల్లా జరిపట్కాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. తన భార్యాపిల్లల్ని చంపి చివరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఏం జరిగిందంటే..?
నాగ్‌పుర్ జిల్లా జరిపట్కాలో ఉండే మదన్ అగర్వాల్‌కు (33) భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అగర్వాల్ దయానంద్ పార్క్ వద్ద ఓ ఫుడ్ స్టాల్ నిర్వహిస్తున్నాడు. బ్యాంకు వద్ద తీసుకున్న రుణం చెల్లించనందున ఇటీవల బ్యాంకు.. అగర్వాల్ ఇంటిని జప్తు చేసింది. దీంతో జరిపట్కా ప్రాంతంలో అద్దెకు ఉంటున్నాడు. అయితే.. మంగళవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో.. అగర్వాల్ స్నేహితుడు ఇంటికి వెళ్లి తలుపు కొట్టగా ఎవ్వరూ తీయలేదు.