అఫ్గానిస్తాన్ నుంచి అక్రమంగా హెరాయిన్ తరలిస్తున్న ఓ స్మగ్లర్‌ను అరెస్టు చేశారు మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు. నిందితుడి దగ్గర నుంచి దాదాపు 300 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ రూ. 879 కోట్ల వరకు ఉంటుందని స్పష్టం చేశారు.
ఇరాన్, అఫ్గానిస్తాన్ నుంచి అక్రమంగా తరలించిన సరుకును.. జిప్సమ్ స్టోన్, తాల్కమ్ పౌడర్‌గా గుర్తించారు అధికారులు. ఈ సరుకును సరఫరా చేస్తున్న ప్రబ్జోత్ సింగ్ అనే నిందితుడిని రాయ్‌గఢ్ సమీపంలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్(జేఎన్పీటీ) సమీపంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. ఏడాది నుంచి నిందితుడు మత్తు పదార్థాల దందా కొనసాగిస్తున్నట్లు తెలిసిందని అధికారులు పేర్కొన్నారు.