29 ఏళ్ల క్రితం నాటి ఓ హత్య కేసులో నిందితుడ్ని మహారాష్ట్ర వార్ధా పోలీసులు పట్టుకున్నారు. సెలవు ఇవ్వలేదన్న కారణంతో.. సహోద్యోగిపై కాల్పులు జరిపి, హత్య చేసిన కేసులో సీఆర్పీఎఫ్ మాజీ ఉద్యోగిని అరెస్టు చేశారు.
అసలేం జరిగింది?
మహారాష్ట్ర ఆర్వీ ప్రాంతానికి చెందిన.. సుభాష్ రామకృష్ణ నఖ్లే అనే వ్యక్తి.. త్రిపుర కాంచంపుర్లోని సీఆర్పీఎఫ్ 45వ బెటాలియన్లో విధులు నిర్వర్తించేవాడు. 1992 జూన్ 3న అతడు తన కుటుంబ సభ్యుల్లో ఒకరు మరణించినందున.. సెలవు కావాలని తన పైఅధికారులకు విజ్ఞప్తి చేశాడు. అయితే.. వారు అతనికి సెలవు మంజూరు చేయలేదు. దాంతో ఆగ్రహానికి గురైన సుభాష్ నఖ్లే.. తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు.