Maharashtra Crime News: మహారాష్ట్ర నాగ్‌పుర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల యువకుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు మరో ఇద్దరు యువకులు. బాధితుడి ఫిర్యాదు, మెడికల్ రిపోర్ట్ ఆధారంగా వారిపై నందన్వన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిందితులను అవేశ్ మిర్జా, అనిల్‌గా గుర్తించారు అధికారులు.
ఇదీ జరిగింది:బాధిత యువకుడికి, నిందితులకు ఓ ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే నందన్వన్లోని మెటర్నిటీ వార్డు సమీపంలో ఉన్న పొదల్లోకి రావాలని సదరు యువకుడిని వారు పిలిచారు. అక్కడికి చేరుకోగానే.. అతడిపై అసహజ సంభోగానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అనంతరం బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
బాలికపై నలుగురు కలిసి..:కేరళలోని ఇడుక్కిలో మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు.. బంగాల్ నుంచి వలస వచ్చిన కూలీలని తెలిపారు.
"ఒక స్నేహితుడితో కలిసి తేయాకు తోటలకు ప్రసిద్ధి గాంచిన పూప్పర గ్రామానికి ఆ బాలిక వెళ్లింది. అతడితో మాట్లాడుతున్న సమయంలో నలుగురు వ్యక్తులు ఆ స్నేహితుడిని కొట్టి, తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. సహాయం కోసం కేకలు పెట్టగా.. స్థానికులు అక్కడికి చేరుకొని వారిని కాపాడారు. కానీ నిందితులు పారిపోయారు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం ఉదయం ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇద్దరు అనుమానితులను ప్రశ్నిస్తున్నాం. దర్యాప్తు ముమ్మరం చేశాం" అని ఓ సీనియర్ అధికారి తెలిపారు.
ఇదీ చూడండి:సిద్ధూ హత్య వీడియో వైరల్.. ఏడుగురు అనుమానితులు గుర్తింపు