తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో లక్ష దాటిన కరోనా మరణాలు - వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు

వివిధ రాష్ట్రాల్లో రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తమిళనాడులో కొత్తగా 20 వేల కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో కొత్తగా 12 వేల కేసులు నమోదయ్యాయి. మరో 233 మంది చనిపోగా.. ఆ రాష్ట్రంలో మొత్తం కొవిడ్​ మృతుల సంఖ్య లక్ష దాటింది.

Maharashtra COVID-19 death
రాష్ట్రాల్లో కరోనా కేసులు

By

Published : Jun 6, 2021, 10:12 PM IST

దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తమిళనాడులో కొత్తగా 20,421 కేసులు నమోదయ్యాయి. 434 మంది ప్రాణాలు కోల్పోయారు. 33,161 మంది డిశ్చార్జ్ అయ్యారు.

మహారాష్ట్రలో 12,557 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 233 మంది చనిపోయారు. దీంతో మొత్తం ఆ రాష్ట్రంలో కరోనా ధాటికి కన్నుమూసిన వారి సంఖ్య 1,00,130కి చేరింది.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..

  • దిల్లీలో కొత్తగా 381 కేసులు వెలుగులోకి వచ్చాయి. 34 మంది మరణించారు.
  • కేరళలో 14,672 కేసులు నమోదయ్యాయి. 227 మంది మృతి చెందారు.
  • కర్ణాటకలో 12,209 కేసులు బయటపడ్డాయి. 320 మంది మరణించారు.
  • గుజరాత్​లో 848 కేసులు బయటపడ్డాయి. 12 మంది వైరస్​ ధాటికి బలయ్యారు.
  • రాజస్థాన్​లో కొత్తగా 8,656 మందికి వైరస్​ సోకింది. మరో 25 మంది మరణించారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 1,165 మందికి కరోనా సోకగా.. మరో 101 మంది వైరస్​ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
  • మధ్యప్రదేశ్​లో కొత్తగా 735 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. మరో 42 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:కొవిడ్​ నుంచి కోలుకున్న వారిలో కొత్త రకం వ్యాధి!

ఇదీ చూడండి:'కరోనాపై పోరాటం కోసం హోమం చేయాల్సింది'

ABOUT THE AUTHOR

...view details