మరాఠాలను సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాల(ఎస్ఈబీసీ) జాబితాలో చేర్చాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. ఈ మేరకు మంగళవారం ప్రధానికి లేఖ రాశారు. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు 12, 13 శాతం రిజర్వేషన్ కల్పించే అవకాశం ఇవ్వాలని ఠాక్రే కోరారు.
మే 5న మరాఠా రిజర్వేషన్లు రద్దు చేస్తూ.. ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ఠాక్రే లేఖకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మరోసారి తెలుపనున్నట్లు ఠాక్రే లేఖలో పేర్కొన్నారు.