తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Param Bir Singh News: పరంబీర్​ సింగ్​కు సీఐడీ సమన్లు - పరంబీర్​ సింగ్ కేసు

Param Bir Singh News: బలవంతపు వసూళ్ల కేసులో భాగంగా ముంబయి మాజీ పోలీస్ కమిషనర్​ పరమ్​బీర్​సింగ్​కు మహారాష్ట్ర సీఐడీ సమన్లు జారీ చేసింది. సోమవారం లేదా మంగళవారం రోజు కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఆదేశించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

Param Bir Singh News
పరంబీర్​ సింగ్

By

Published : Nov 27, 2021, 1:57 PM IST

Param Bir Singh News: బలవంతపు వసూళ్లకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబయి మాజీ పోలీసు కమిషనర్‌ పరమ్‌బీర్​‌ సింగ్​కు మహారాష్ట్ర నేర దర్యాప్తు విభాగం(సీఐడీ) సమన్లు జారీ చేసింది. సోమవారం లేదా మంగళవారం ఏజెన్సీ ఎదుట హాజరుకావాలని ఆదేశించినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

ముంబయికి చెందిన కేతన్​ తన్నా, సోనూ జలాన్​, రియాజ్​ భాటియాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బలవంతపు వసూళ్లకు సంబంధించి జులై 30న పరంబీర్​సింగ్​తోపాటు మరో 29 మందిపై ఠాణె పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది.

అయితే.. పరమ్​బీర్​సింగ్​పై జారీ చేసిన నాన్​బెయిలబుల్ వారెంట్​ను ఠాణే కోర్టు శుక్రవారం రద్దు చేసింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని పరంబీర్​ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఠాణే పోలీస్ స్టేషన్​లో హాజరయ్యారు పరమ్​బీర్​ సింగ్​.

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాలతో కూడిన ఎస్​యూవీ నిలిపివేత, వ్యాపారవేత్త మన్‌సుఖ్​ హిరేన్‌ హత్య కేసులో మాజీ పోలీసు అధికారి సచిన్ వాజే అరెస్టయ్యారు. ఆ తర్వాత ముంబయి పోలీసు కమిషనర్‌గా ఉన్న పరమ్‌బీర్‌ సింగ్‌ను మహారాష్ట్ర సర్కార్‌ బదిలీ చేసింది. అప్పటి నుంచి ఆయన అదృశ్యమయ్యారు. ఈ ఏడాది మే తర్వాత ఒక్కసారి కూడా ఆఫీస్​కు వెళ్లలేదు.

ఇదీ చూడండి:పరంబీర్​ సింగ్​పై నాన్​ బెయిలబుల్​ వారెంట్​ రద్దు

ABOUT THE AUTHOR

...view details