తెలంగాణ

telangana

By

Published : Apr 2, 2021, 2:37 PM IST

Updated : Apr 2, 2021, 3:42 PM IST

ETV Bharat / bharat

రాత్రికి 'మహా' సీఎం ప్రసంగం- లాక్​డౌన్​పై ప్రకటన?

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే శుక్రవారం రాత్రి 8:30 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సీఎం మళ్లీ లాక్​డౌన్ ప్రకటిస్తారా? అనే చర్చ మొదలైంది.

Maharashtra Chief Minister Uddhav Thackeray to address people of the state today at 8:30 pm: Mumbai Mayor Kishori Pednekar
లాక్​డౌన్​ ప్రకటించనున్న 'మహా' సీఎం?

మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇవాళ రాత్రి 8:30 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్న తరుణంలో సీఎం మళ్లీ లాక్​డౌన్​ ప్రటిస్తారా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఆర్థిక ప్రభావం లేకుండా లాకౌడౌన్ విధించే సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులను ఠాక్రే ఇప్పటికే ఆదేశించడం దీనికి బలం చేకూర్చుతోంది.

సీఎం ప్రసంగిస్తారనే విషయాన్ని ముంబయి మేయర్ కిశోరి పెడ్నేకర్​ వెల్లడించారు. ప్రజల నిర్లక్ష్యం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆమె అన్నారు. ఈ పరిస్థితి ఆందోళనకరమని, ఆస్పత్రుల్లో పడకల కొరత, వెంటిలేటర్ల కొరత మళ్లీ ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

పుణెలో షట్​డౌన్​..

కేసులు పెరుగుతున్నందున పుణెలో శనివారం నుంచి వారం రోజుల పాటు బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. హోం డెలివరీ మాత్రం కొనసాగించవచ్చన్నారు. అంత్యక్రియలు, వివాహ వేడుకలు మినహా మరే ఇతర ఫంక్షన్లకు అనుమతి లేదని చెప్పారు.

మధ్యప్రదేశ్​లో పలు జిల్లాలు..

మధ్యప్రదేశ్​లోనూ కరోనా ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం లాక్​డౌన్​ అమలు చేస్తోంది. ఛింద్వాడా జిల్లా, రత్లాం నగరాల్లో గురువారం రాత్రి నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి బైతూల్ జిల్లా, ఖర్గోన్​లోని పలు ప్రాంతాల్లో​ లౌక్​డౌన్​ అమలు కానుంది. ఈ ప్రాంతాల్లో ఏప్రిల్​ 5 ఉదయం 6గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. ఈ జిల్లాలో కరోనా పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక అధికారుల బృందాలు వెళ్లాయని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​ వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అమలు చేస్తున్న లాక్​డౌన్​ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఛత్తీస్​గఢ్​లో..

ఛత్తీస్​గఢ్ దుర్గ్​ జిల్లాలోనూ ఏప్రిల్ 6నుంచి 14 వరకు పూర్తి లాక్​డౌన్ విధిస్తున్నట్లు అధికారులు చెప్పారు. కరోనా కేసులు పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: కరోనా టీకా పంపిణీలో భారత్​ కొత్త రికార్డ్

Last Updated : Apr 2, 2021, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details