Maharashtra cases today: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కాస్త తగ్గింది. సోమవారం కొత్తగా 676 మంది వైరస్ బారినపడ్డారు. కరోనా కారణంగా ఎవరూ మరణించలేదని బృహన్ ముంబయి కార్పొరేషన్ తెలిపింది. ప్రస్తుతం ముంబయిలో 5,238 క్రియాశీల కేసులు ఉన్నాయి. 676 మంది కొత్త రోగుల్లో 622 మందికి వైరస్ లక్షణాలు లేవు. లక్షణాలున్న 54 మంది రోగులు మాత్రమే ఆసుపత్రులలో చేరారు. మే 30 నుంచి జూన్ 5 మధ్య కేసుల మొత్తం వృద్ధి రేటు 0.066 శాతంగా ఉంది. సోమవారం మరో 318 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
మహారాష్ట్రలో తగ్గిన కరోనా కేసులు - భారత్లో కొవిడ్ కేసులు
Maharashtra cases today: మహారాష్ట్రలో కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. సోమవారం కొత్తగా 676 మందికి వైరస్ సోకింది. 318 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
కొవిడ్ కేసుల రోజువారీ గ్రాఫ్ జూన్ 1 తరువాత మొదటిసారిగా 700 మార్కు కంటే దిగువకు చేరింది. క్రితం రోజుతో పోల్చితే 285 తక్కువ కేసులు నమోదయ్యాయి. ముంబయిలో మొత్తం కేసుల సంఖ్య 10,70,534 కాగా, కొవిడ్ మరణాల సంఖ్య 19,569గా ఉంది. ముంబయిలో కేసుల పాజిటివిటీ రేటు 0.098 శాతంగా ఉందని అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 6,897 నమూనాలను పరీక్షించారు. దీంతో ఇప్పటివరకు మహానగరంలో నిర్వహించిన పరీక్షల సంఖ్య 1,71,90,848కి చేరింది.
ఇదీ చదవండి:'దేశంలోని ప్రతి జిల్లాలో ఓ వృద్ధాశ్రమం'