లఖింపుర్ ఖేరిలో హింసకు వ్యతిరేకంగా మహారాష్ట్రలో బంద్(Maharashtra bandh) చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపై జరిగిన దాడికి నిరసనగా కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఆధ్వర్యంలోని మహా వికాస్ ఆఘాఢీ బంద్‌కు పిలుపునిచ్చింది(Maharashtra bandh). సాయంత్రం 4 గంటల వరకు బంద్‌లో పాల్గొనాలన్న పిలుపుతో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ స్వచ్ఛందంగా నిలిచిపోయాయి. గుర్తుతెలియని వ్యక్తులు చేసిన రాళ్లదాడిలో 9 ప్రభుత్వ బస్సులు దెబ్బతిన్నాయి(Maharashtra news ). దీంతో బస్సు సర్వీసులను బృహన్ ముంబయి కార్పొరేషన్ రద్దు చేసింది.
మహారాష్ట్ర బంద్‌లో ఉద్రిక్తత- 9 బస్సులు ధ్వంసం - Maharashtra political news
మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ బంద్(Maharashtra bandh) చేపట్టింది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. గుర్తుతెలియని వ్యక్తులు చేసిన రాళ్లదాడిలో 9 ప్రభుత్వ బస్సులు దెబ్బతిన్నాయి. దీంతో బస్సు సర్వీసులను బృహన్ ముంబయి కార్పొరేషన్ రద్దు చేసింది.
మహారాష్ట్ర వ్యాప్తంగా బంద్
మరోవైపు బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:'చైనా పెడ ధోరణి- 13వ విడత చర్చల్లో పురోగతి శూన్యం'
Last Updated : Oct 11, 2021, 4:48 PM IST