తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తల్లిదండ్రుల్ని పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో కోత! - తల్లిదండ్రుల పట్ల అశ్రద్ధ వహిస్తే.. ఉద్యోగుల జీతాల్లో కోత!

తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని తీర్మానం చేసిన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా పరిషత్. అమలుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.

Aurangabad ZP passed resolution about Employees salary, If not taking care of parents
తల్లిదండ్రుల పట్ల అశ్రద్ధ వహిస్తే.. ఉద్యోగుల జీతాల్లో కోత!

By

Published : Jan 22, 2021, 6:54 PM IST

తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతంలో కోత విధించేలా ఓ కొత్త తీర్మానాన్ని ప్రవేశపెట్టింది మహారాష్ట్రలోని ఔరంగాబాద్​ జిల్లా పరిషత్​. విధి నిర్వహణలో ఒత్తిడి కారణంగా.. వారిపై అలసత్వం ప్రదర్శిస్తే సంబంధిత సిబ్బంది వేతనంలో 30శాతం కోత విధించాలని ప్రతిపాదించింది.

స్థానిక జిల్లా పరిషత్​ కార్యాలయంలో ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. అయితే.. తదుపరి అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్టు జిల్లా పరిషత్​ అధ్యక్షురాలు మీనా షెల్కే తెలిపారు. తల్లిదండ్రుల ఆలనాపాలనా చూసుకోని ఉద్యోగులకు ఇదో హెచ్చరిక అవుతుందని ఆమె పేర్కొన్నారు.

"ఉద్యోగుల తల్లిదండ్రుల నుంచి ఇటీవల చాలా ఫిర్యాదులు వచ్చాయి. అందుకు ప్రతిఫలంగానే ఈ చర్యలకు పూనుకోవాల్సి వచ్చింది. ఉద్యోగుల జీతంలో కొంత భాగం వారి తల్లిదండ్రుల ఖాతాల్లో జమ అవుతుంది. ఈ సొమ్ము వారి పరిస్థితులను మెరుగుపరచుకునేందుకు సాయపడుతుంది. ఈ తీర్మానాన్ని ఉద్యోగులంతా స్వాగతించారు."

- మీనా షెల్కే, జిల్లా పరిషత్​ అధ్యక్షురాలు

ఇదీ చదవండి:బైడెన్​పై ప్రేమతో మైనపు విగ్రహం

ABOUT THE AUTHOR

...view details