తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.5 కోట్లు విలువైన హెరాయిన్ పట్టివేత- ఇద్దరు అరెస్ట్​ - మహారాష్టలో హెరాయిన్ స్వాధీనం

Maharashtra ATS: రూ.5 కోట్లు విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకుంది మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేసింది.

Maharashtra ATS
Maharashtra ATS

By

Published : Feb 7, 2022, 9:43 AM IST

Maharashtra ATS: మహారాష్ట్ర పాల్ఘర్​ జిల్లాలో రూ.5 కోట్లు విలువైన హెరాయిన్​ పట్టుబడింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు డ్రగ్స్​ వ్యాపారులను అరెస్ట్​ చేసింది మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం(ఏటీఎస్​).

వసయీ ప్రాంతంలోని పెల్హార్​ గ్రామంలో మాదక ద్రవ్యాల రవాణా జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఏటీఎస్​ అధికారులు.. తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 1.724 కిలోల హెరాయిన్​ పట్టుబడింది. దీంతో పాటు రూ.2,60,000 నగదు, రెండు మొబైల్​ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు.

షూ రవాణా ముసుగులో డ్రగ్స్​..

ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిపై కేసు నమోదు చేసిన అధికారులు.. ఇద్దరిని అరెస్ట్​ చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఆ ఇద్దరు నిందితులను ఉత్తరాఖండ్​కు చెందిన అలీమ్​ మహ్మద్​ అక్తర్​(30), చోటా మహ్మద్​ నజీర్​లుగా(40) గుర్తించారు. వారిని విచారించగా కొత్త బూటుల్లో రాజస్థాన్​ నుంచి ముంబయికి డ్రగ్స్​​ రవాణా చేస్తున్నట్లు చెప్పారని అధికారులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా.. ఫిబ్రవరి 15 వరకు తమ​ కస్టడీకి పంపినట్లు ఏటీఎస్​ తెలిపింది.

ఇదీ చూడండి:దేశంలో లక్ష దిగువకు కరోనా కొత్త కేసులు.. పెరిగిన మరణాలు

ABOUT THE AUTHOR

...view details