తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిడ్డ కోసం చిరుతతో మహిళ ఫైట్​! - చిరుతపులితో తల్లి పోరాటం

తన బిడ్డ ప్రమాదంలో ఉందని తెలిస్తే.. తల్లి ఎంతకైనా తెగించడానికి సిద్ధపడుతుంది. మహారాష్ట్రకు చెందిన ఓ తల్లి కూడా అదే చేసింది. చిరుతపులి నోట కరిచిన తన బిడ్డను కాపాడేందుకు విశ్వప్రయత్నం చేసిందో మాతృమూర్తి. ఆఖరు వరకు తన పోరాటాన్ని ఆపలేదు. చివరకు ఏమైందంటే..

Mother fights with leopard
చిరుత నుంచి బిడ్డను కాపాడిన తల్లి

By

Published : Jul 18, 2021, 3:44 PM IST

కన్నబిడ్డ కోసం చిరుతపులితో వీరోచితంగా పోరాడింది ఓ మహిళ. చివరకు తన బిడ్డను పులి పంజా నుంచి కాపాడుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని చంద్రపుర్​ జిల్లాలో జరిగింది.

చిరుత బారి నుంచి బిడ్డను కాపాడిన తల్లి అర్చన

ఇదీ జరిగింది

చంద్రపుర్​ జిల్లాలో జునోనా.. ఓ మారుమూల గ్రామం. చుట్టూ దట్టమైన అడవి ఉన్న ఈ గ్రామంలోనే అర్చన​ కుటుంబం నివసిస్తుంది. కూరగాయల కోసం తన కుమార్తెను తీసుకుని సమీపంలోని మార్కెట్​కు వెళ్లింది. ఇంతలో ఓ చిరుత వచ్చి, ఆ చిన్నారిపై దాడిచేసింది. పక్కనే ఉన్న తల్లి భయపడకుండా ఓ కర్ర పట్టుకుని చిరుతను చితకబాదింది. తనపై కూడా చిరుత దాడి చేసినప్పటికీ ఆ కర్రతోనే పులిని ఎదిరించింది. తన బిడ్డను వదిలే వరకు పోరాటం చేసింది. దీంతో ఏమీ చేయలేక అడవుల్లోకి పారిపోయింది ఆ చిరుత. ఫలితంగా ఆ తల్లికి తన కూతురు దక్కింది.

ఇదీ చూడండి:స్టేజిపైనే వరుడు నిద్ర.. వధువు రియాక్షన్ చూస్తే...

ABOUT THE AUTHOR

...view details