తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Rape: 65ఏళ్ల తల్లిపై కొడుకు అత్యాచారం! - కొడుకు అత్యాచారం

భార్య పుట్టింటికి వెళ్లిన క్రమంలో కామంతో రగిలిపోయిన ఓ వ్యక్తి సొంత తల్లిపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ అమానుష ఘటన మహారాష్ట్ర బుల్డానా జిల్లాలో జరిగింది.

Rape
అత్యాచారం

By

Published : Jun 7, 2021, 8:51 AM IST

కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు వావివరసలు మరిచి.. క్రూరంగా ప్రవర్తిస్తుంటారు. సొంత వారిపైనే అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్ర బుల్డానా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. 65ఏళ్ల వృద్ధ తల్లిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు.

జిల్లాలోని పింగల్గావూన్​ గ్రామంలో కిశోర్​ ఖందేర్(45) అనే వ్యక్తి​.. తన తల్లి, భార్యతో నివసిస్తున్నాడు. ఇటీవల ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది భార్య. ఈ క్రమంలో కామంతో కళ్లు మూసుకుపోయిన కిశోర్.. ఈనెల 5న రాత్రి​ వేళ తల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

రాయ్​పుర్​ పోలీస్​ స్టేషన్​లో బాధితురాలు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై గ్రామంతో పాటు జిల్లావ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:తల్లి మరణంలోనూ విధుల్లోనే 'పేపర్​ బాయ్'!​

ABOUT THE AUTHOR

...view details